తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్:-కేసీఆర్
వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు ఒక్కడినే బయలుదేరానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు కొందరు వెటకారం చేశారన్నారు. అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని కేసీఆర్ వివరించారు. "కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదు, ఏడాదిన్నర పూర్తయ్యింది ఇంకెప్పుడు చేస్తారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి తెలివితో పని చేయాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్లీ అక్కడే సాధించాలి. మాట్లాడితే బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారు. భూములు అమ్మొచ్చు.. అభివృద్ధి చేయొచ్చు కానీ యూనివర్సిటీ బూములు అమ్ముతారా" అని కేసీఆర్ ప్రశ్నించారు. "వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నేను రద్దు చేయలేదు. ఎవరు తెచ్చినా బాగున్న పథకాన్ని కొనసాగించాలని చెప్పా. పేరు కూడా మార్చకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగించాం. బీఆర్ఎస్ సభ పెట్టుకుంటే ఆటంకాలు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు, ప్రజలపై కేసులు పెడుతున్న పోలీసులు గుర్తించుకోవాలి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఆపటం ఎవరితరం కాదు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?. కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది" అని హామీ ఇచ్చారు.