మిర్యాలగూడ, ఏప్రిల్ 26 (క్విక్ టుడే న్యూస్):-జమ్ము కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా, మృతి చెందిన భారతీయులకు నివాళులు అర్పిస్తూ, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు భారీగా క్యాండిల్స్ తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్-కలెక్టర్ నారాయణ అమిత్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, యమ్ఆర్ఓ లు, మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యమ సంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, లయన్స్ క్లబ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వాసవి క్లబ్, ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారస్థులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, కుల, మత, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్షమా రెడ్డి మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ, మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని కులాల, మతాల వారు, సంఘాల వారు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ స్వచ్ఛంగా పాల్గొని భారత దేశంలో బిన్నతవంలో ఏకత్వంగా, మేమంతా ఒక్కటే అని సోదర భావాన్ని మిర్యాలగూడ నుంచి మతాల పేరుతో మనమధ్యలో అల్లర్లు రేపుతున్న ఉగ్రవాద మూకలకు హెచ్చరికలు పంపామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
