Ambati Rayudu – Pawan Kalyan : వైసీపీకి భారీ షాక్.. జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడు.. ప్రకటించిన పార్టీ 

Ambati Rayudu – Pawan Kalyan : వైసీపీకి భారీ షాక్.. జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడు.. ప్రకటించిన పార్టీ 

Ambati Rayudu – Pawan Kalyan : అసలు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అసలే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఇక ఆ మాత్రం హడావుడి ఉండదా? ఆ పార్టీలో ఉన్నవాళ్లు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో ఉన్నవాళ్లు ఆ పార్టీలోకి అన్నట్టుగా హడావుడి నడుస్తోంది. రాత్రికి రాత్రే కొందరు నేతలు పార్టీలు మారుతున్నాయి.

రోజులు మారినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నేత.. రేపు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియడం లేదు. అలా ఉన్నాయి రాజకీయాలు. తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా జనసేనకే జై కొట్టేశాడు. క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు.. వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ నుంచి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి.

Read Also మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?

అయితే.. అంబటి రాయుడు గుంటూరు నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ఆయన గుంటూరు టికెట్ ను ఆశించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఎన్నికల వేళ సడెన్ గా తన నిర్ణయాన్ని మార్చుకొని జనసేన వైపు మళ్లారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన అంబటి రాయుడు.. ఆ పార్టీలో చేరేందుకు సుముఖత చూపించినట్టు అర్థం అయింది కానీ.. ఆ పార్టీలో మాత్రం చేరలేదు.  

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

111 -1

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

Ambati Rayudu – Pawan Kalyan : స్టార్ క్యాంపెయినర్ జాబితాలో అంబటి పేరు

కట్ చేస్తే.. జనసేన పార్టీ తాజాగా విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అంబటి రాయుడు పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారని.. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, అంబటి రాయుడు (క్రికెటర్), కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారని.. జనసేన అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్ పేరుతో జనసేన ఓ ప్రకటనను విడుదల చేసింది. 

అంటే.. వైసీపీ నుంచి అంబటి రాయుడుకు స్పష్టమైన హామీ రాలేదనే టాక్ వినిపిస్తోంది. గుంటూరు నుంచి ఇప్పటికే చాలామంది వైసీపీ నుంచి వెయిటింగ్ లో ఉండటంతో నిన్న కాక మొన్న పార్టీలో చేరిన అంబటికి టికెట్ ఎలా ఇస్తారు అనే వార్తలు వినిపించాయి. దీంతో అంబటికి సీన్ అర్థం అయి.. వెంటనే పార్టీలో చేరిన పది రోజులకే ఆ పార్టీకి షాక్ ఇచ్చి జనసేన వైపు మళ్లారు. 

111 -2

ఈసందర్భంగా పవన్ తో భేటీ అయ్యారు. కానీ.. పార్టీలో చేరకున్నా జనసేన తరుపున స్టార్ క్యాంపెయినర్ గా అంబటి రాయుడికి స్థానం దక్కింది. అలాగే.. పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్ధాం అంటూ అంబటి రాయుడు బుధవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. 

నిజానికి.. వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అంతర్జాతీయ టీ20 లీగ్ కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది కాబట్టి రాజకీయాలకు కొన్నేళ్ల పాటు విరామం ఇస్తున్నా అని చెప్పిన అంబటి రాయుడు.. ఇప్పుడు జనసేన స్టార్ క్యాంపెయినర్ గా నియమితులు కావడంతో క్రికెట్ కెరీర్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తారా? జనసేనలో కంటిన్యూ అవుతారా? ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తే.. అంబటికి ఏదైనా పదవి వస్తుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?