AP CM YS Jagan : సీఎం జగన్ మొత్తం ఆస్తులు ఇవే.. 2019 లో ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత పెరిగాయో..
ఇక.. వైసీపీ పార్టీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్.. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇంకా నామినేషన్ వేయలేదు కానీ.. సీఎం జగన్ తరుపున తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల ఎన్నికల అధికారికి.. జగన్ తరుపున మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ నెల 25న సీఎం జగన్.. పులివెందులకు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కానీ.. 22న మంచి రోజు కావడంతో ముందే ఒక సెట్ నామినేషన్ ను జగన్ తరుపున మనోహర్ రెడ్డి.. ఎన్నికల అధికారికి అందజేశారు.
AP CM YS Jagan : అఫిడవిట్ లో పేర్కొన్న జగన్ ఆస్తుల వివరాలు ఇవే
జగన్ తరుపున మనోహర్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ సెట్ లో ఉన్న అఫిడవిట్ లో జగన్ ఆస్తుల వివరాలను పొందుపరిచారు. అందులో సీఎం జగన్ కుటుంబానికి ఉన్న ఆస్తులు మొత్తం రూ.779.8 కోట్లుగా ఉంది. అంటే.. అవి కుటుంబం మొత్తం ఆస్తులు అన్నమాట.
ఇక.. ఆయనకు పలు కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. అలాగే కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి విలువ రూ.650.66 కోట్లుగా ఉంది. ఈ ఆస్తుల్లో సీఎం జగన్ పేరుతో రూ.483.08 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య భారతి రెడ్డి పేరుతో రూ.119.38 కోట్లు ఉన్నాయి. జగన్ కూతురు హర్షిణి రెడ్డి పేరుతో రూ.24.26 కోట్లు ఉన్నాయి. మరో కూతురు వర్షా రెడ్డి పేరు మీద రూ.23.94 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
ఇక.. తన ఫ్యామిలీ పేరు మీద రూ.106.96 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు సీఎం జగన్ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ స్థిరాస్తుల్లో జగన్ పేరు మీద ఉన్న ఆస్తులు చూసుకుంటే రూ.46.78 కోట్లు కాగా.. భారతి రెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులు రూ.56.92 కోట్లు. తన కూతుళ్లలో హర్షిణి రెడ్డి పేరు మీద రూ.1.63 కోట్లు, వర్షా రెడ్డి పేరు మీద రూ.1.63 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఇందులో సీఎం జగన్ తన వ్యక్తిగత ఆదాయాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయం రూ.57.74 కోట్లుగా పేర్కొన్నారు. ఆయన ఇతరులకు ఇచ్చిన అప్పుల వివరాలు కూడా పేర్కొన్నారు. ఆయన ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.179.74 కోట్లు కాగా.. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి గాను సీఎం జగన్ రూ.4.66 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు.
అలాగే.. ఈ సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ రూ.13.95 కోట్లు ముందే చెల్లించారు. పలు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు, ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు, రుణాలు కూడా రూ.1.1 కోట్లుగా పేర్కొన్నారు.
అలాగే.. సీఎం జగన్ భార్య వైఎస్ భారతి తాను సొంతంగా సంపాదించిన ఆదాయం వివరాలు కూడా అఫిడవిట్ లో పొందుపరిచారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ భారతి రెడ్డి వ్యక్తిగత ఆదాయం రూ.10.96 కోట్లుగా ఉంది. అయితే.. భారతి రెడ్డి వేరే వాళ్లకు ఇచ్చిన అప్పులు రూ.30.91 లక్షలుగా పేర్కొన్నారు.
వైఎస్ భారతి తనకు వచ్చిన ఆదాయంలో రూ.1.57 కోట్లను ఇన్ కమ్ ట్యాక్స్ గా చెల్లించారు. అందులో అడ్వాన్స్ ట్యాక్స్ రూ.2.48 కోట్లు చెల్లించారు. భారతి రెడ్డి పలు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి, ఇతరుల నుంచి తీసుకున్న అప్పు, అడ్వాన్స్ రూ.7.41 కోట్లుగా ఉంది.
ఇక.. సీఎం జగన్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ సీఎం జగన్ కోర్టులో విచారణకు హాజరవుతున్నారు. అలాగే.. కొన్ని రోజులు అప్పట్లో సీఎం జగన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. తనపై ఇప్పటి వరకు పలు కోర్టుల్లో 26 కేసులు నమోదు అయ్యాయని.. అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయని.. తన అఫిడవిట్ లో సీఎం జగన్ స్పష్టం చేశారు.
2019 ఎన్నికల సమయంలో అందజేసిన అఫిడవిట్ తో పోల్చితే సీఎం జగన్ ఆస్తులు ఈసారి బాగా పెరిగాయి. అప్పటికీ ఇప్పటికీ జగన్ పేర్కొన్న ఆస్తుల్లో చాలా వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఆయన ఆస్తులు మాత్రం పెరిగాయి.