Chandrababu : నాది మిషన్.. జగన్‌ది పాయిజన్.. విషంతో చంపే రకం జగన్..

 Chandrababu : నాది మిషన్.. జగన్‌ది పాయిజన్.. విషంతో చంపే రకం జగన్..

 

Chandrababu : నాది మిషన్.. టీడీపీ పార్టీది మిషన్.. కానీ జగన్ ది మాత్రం పాయిజన్. విషంతో చంపే రకం జగన్ మోహన్ రెడ్డి. హైదరాబాద్ లో సైబరాబాద్ ను నిర్మించిందే నేను. సైబరాబాద్ ను నిర్మించిందే టీడీపీ పార్టీ. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచపటంలో నిలబడగలిగిందంటే దానికి కారణం టీడీపీ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించారు.

Read Also మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?

ఈ సందర్భంగా పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. పాలకొల్లు నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరుకు చేరుకున్నారు. అక్కడ ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం సత్తెనపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏపీ సీఎం జగన్ పై ఎక్కు పెట్టారు. 

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

కేంద్రంలో మళ్లీ రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. జగన్ రావణాసురుడి లాంటి వాడు. అలాంటి వాడిని అంతం చేయాలంటే బీజేపీ లాంటి పార్టీ అవసరం ఉంది. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది రాష్ట్రం కోసమే.. అని చంద్రబాబు తెలిపారు. రావణాసురుడిని చంపేందుకు వానర సైన్యం అంతా కలిసి రావాలి. రాముడు దేవుడు. కానీ అందరి సహకారంతో ముందుకెళ్లాడు.

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

 

naidu

ఉడత కూడా రాముడికి సాయం చేసింది. రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం అది. ఈరోజు కూడా నేను ఒక్కడినే రాలేదు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జనసైనికులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు.. జగన్ మోహన్ రెడ్డి శవాలతో ముందుకు వస్తుంటే నేను నాయకులతో వస్తున్నా. శవ రాజకీయాలు వాళ్లు చేస్తుంటే నేను మీకు భవిష్యత్తును కలుగజేసేందుకు వస్తున్నా అన్నారు. 

Chandrababu : 5 ఏళ్ల పాలన ఒక పీడ కలఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం, స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలి ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు పెదకూరపాడు నియోజకవర్గం అంటే ఒరిజినల్ అమరావతి ఇక్కడే. స్ఫూర్తి అమరావతి, అమర లింగేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు? ఇసుక భకాసురుడు శంకర్ రావు, ఇసుక దోపిడి ఇప్పుడు గుర్తొస్తుంది. వీళ్లు చేసే దోపిడి రిటైల్ కూడా కాదు.. హోల్ సేల్ గా దోపిడి చేస్తున్నారు అని చంద్రబాబు తెలిపారు. 

40 లక్షల మంది పవర్ నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి శంకర్ రావు, జగన్ మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటున్నారు. కృష్ణా నది మీద రోడ్లేశారు. నేను దాన్ని ఊహించలేకపోతున్నా. అందుకే హామీ ఇస్తున్నా. ఈ ఇసుకాసురులను బొక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకునే బాధ్యత నాది. ఇసుక మాఫియాపైన ఉక్కుపాదం పెట్టి అణగదొక్కుతా అని మీకు అందరికీ హామీ ఇస్తున్నామన్నారు. 

babu

ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ.1000, కానీ ఇప్పుడు రూ.5000. నాలుగు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ కు దళారి వసూలు చేసి మాఫియా లీడర్ అయిన జగన్ మోహన్ రెడ్డికి అందిస్తున్నారు. వీళ్ల అరాచకం చూస్తే కడుపు రగిలిపోతోంది కానీ ప్రజాస్వామ్యం గుర్తొస్తోంది. ఇక్కడ తాపీ మేస్త్రీలు ఉన్నారు. మీరంతా కలిసి వైసీపీ ఫ్యాన్ ను ప్రజలు ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టి దానికి సమాధి కట్టాలన్నారు. 

ఆ సమాధి నుంచి ఫ్యాన్ బయటికి రాకూడదు. మీకు రక్షణ ఉందా ఈ రాష్ట్రంలో. ఏ వర్గానికి అయినా రక్షణ ఉందా? నిన్ననే జగన్ పాలనలో ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు జరిగాయి. నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్లి తిరిగి వస్తుంటే వైసీపీ దొంగ ఆవిడను బలవంతంగా బురఖా తీసి అవమానించారు. ఒక ముస్లిం మైనార్టీని ముఖం మీద బురఖా తీసి అవమానించడం ఎంత వరకు కరెక్ట్.. అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?