Drugs in Vizag : విదేశాల నుంచి వైజాగ్ పోర్ట్‌కు వచ్చిన భారీ కంటెయినర్.. అందులో 25 వేల కిలోల డ్రగ్స్.. సీజ్ చేసిన సీబీఐ
తాజాగా విదేశాల నుంచి ఏపీలోని వైజాగ్ పోర్టుకు ఒక భారీ కంటెయినర్ వచ్చింది. ఆ కంటెయినర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నాయి. అయితే.. ఆ కంటెయినర్ లో డ్రగ్స్ ఉన్నాయని ముందే ఇంటర్ పోల్ ద్వారా సమాచారం సీబీఐ అధికారులు చేరింది. దీంతో వెంటనే వైజాగ్ పోర్టుకు వెళ్లిన అధికారులు.. ఆ భారీ కంటైనర్ ను సీజ్ చేసి తనిఖీ చేయగా అందులో 25 వేల కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. ఆ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ ను సీబీఐ అధికారులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.
Drugs in Vizag : సీబీఐ, కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ గరుడ సక్సెస్
సీబీఐ, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. దీనికి ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టారు. నిజానికి ఇంటర్ పోల్ అధికారుల నుంచి ఢిల్లీ సీబీఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఢిల్లీ సీబీఐ అధికారులు.. వైజాగ్ లోని సీబీఐ, కస్టమ్స్ అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈ టీమ్స్.. ఆ కంటెయినర్ విశాఖ పోర్టుకు రాగానే దాన్ని సీజ్ చేసి దాంట్లో తనిఖీలు చేపట్టారు.
25 వేల కిలోల డ్రగ్స్ ను డ్రై ఈస్ట్ తో మిక్స్ చేశారు. ఆ కంటెయినర్ లో ఉన్నది డ్రగ్సే అని నార్కోటిక్స్ నిపుణులు టెస్ట్ చేసి కన్ఫమ్ చేయడంతో వెంటనే ఆ షిప్పింగ్ కంటైనర్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ కంటైనర్.. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్ట్ నుంచి జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా వైజాగ్ పోర్ట్ కు వచ్చింది. ఈనెల 16న ఆ కంటైనర్ వైజాగ్ కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
వైజాగ్ లోని కన్సిగ్సీ అనే ప్రైవేటు కంపెనీ ఆ కంటైనర్ లో ఉన్న సరుకును బుక్ చేసుకున్నట్టు విచారణలో తేలింది. ఆ డ్రగ్స్ ను 1000 బ్యాగుల్లో నింపారు. ఒక్కో బ్యాగ్ బరువు 25 కిలోల ఉండటంతో మొత్తం 25 వేల కిలోల డ్రగ్స్ గా లెక్క తేలింది. వెంటనే అధికారులు వైజాగ్ లోని కన్సిగ్సీ కంపెనీపై కేసు నమోదు చేశారు. ఆ కంపెనీ లావాదేవీలపై విచారణ చేస్తున్నారు.
బ్రెజిల్ లో ఆ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కంపెనీ మీద కూడా అధికారులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇలా విదేశాల నుంచి వైజాగ్ పోర్ట్ కు డ్రగ్స్ రావడం ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా చాలా సార్లు కంటైనర్ల ద్వారా విశాఖకు డ్రగ్స్ సరఫరా చేశారు.
ఇంటర్ పోల్ అధికారుల సమాచారంతో వైజాగ్ సీబీఐ అధికారులు చాలా సార్లు ఇలాంటి డ్రగ్స్ రాకెట్ ముఠాను పట్టుకున్నారు. సీబీఐ చాలా ఆపరేషన్లు చేసి మరీ డ్రగ్స్ రాకెట్ ను ఛేదిస్తోంది. అయినా కూడా విదేశాల నుంచి డ్రగ్స్ రాక మాత్రం ఆగడం లేదు. అది కూడా వేలకు వేల కిలోల డ్రగ్స్ వచ్చి చేరుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.