DSCs in AP 40 years : ఆంధ్రప్రదేశ్ లో 40 సంవత్సరాలలో 16 డీఎస్సీలు... ఎవరి హయాంలో ఎన్ని నోటిఫికేషన్లు వెలుగొడ్డాయో తెలుసా...?
దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయం లో నోటిఫికేషన్లు విలువడ్డాయి. చివరికి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాడు. ఇకపోతే రాష్ట్ర విభజన తరువాత 2014,2018లో డిఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేశారు.
మొదటిసారి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ఘనత మాత్రం ఎన్టీఆర్ కె దక్కింది. తన పదవీకాలంలో ఎన్టీఆర్ 1984,1986,1989 సంవత్సరంలో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాడు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర రెడ్డి 1994లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది..
తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులలో అత్యధికంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన చంద్రబాబు నాయుడు ఏలు బడిలో మొదట 8 సంవత్సరలలో 6 నోటిఫికేషన్లు, రెండవ పర్యాయం మాత్రం రాష్ట్ర విభజన అయిన తర్వాత 2014 నుండి 2019 మధ్య కాలంలో రెండుసార్లు డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి. మొత్తంగా చూసినట్లయితే చంద్రబాబు జమానాలో 1996,1998,2000,2001,2002,2003,2014,2018 సంవత్సరంలో నోటిఫికేషన్లు వెలువడింది.
ఇక 2004 నుండి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రభుత్వ 2006-2008లో రెండు డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చివరిగా వెలువడిన డిఎస్సి నోటిఫికేషన్ ఇదే. 2014వ సంవత్సరంలో ఏపీ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు.
2014 వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2014 నుండి 2018 సంవత్సరాల్లో నోటిఫికేషన్ విడుదల చేయగా, దాని తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంవత్సరం 2024లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాడు.. తెలంగాణలో మొత్తం రెండు సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడ్డాయి.
2018లో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం డీఎస్సీ టీఆర్టీగా మార్చింది. దాని తర్వాత 2023 లాస్ట్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా, ఎన్నికల కారణం వలన పరీక్షలు వాయిదా వేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చింది. 2023లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది. తరువాత 2024లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో టేట్,డీఎస్సీ పరీక్షల వాతావరణం నెలకొంది.
టెట్ పరీక్షలు ఏపీలో నిర్వహించగా డీఎస్సీ కోసం షెడ్యూలు విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ వలన పరీక్షలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది.తెలంగాణలో మాత్రం టెట్ కంటే ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అభ్యర్థులు మాత్రం కోర్టును ఆశ్రయించారు. దీంతో డిఎస్సీ కంటే ముందు టెట్ పరీక్షలు పెట్టాల్సి ఉందని కోర్టు ఆదేశించింది. దీనివల్ల అప్పటికప్పుడు టెట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యగా, ఇప్పుడు మాత్రం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది..