EC Notice to YS Jagan : జగన్‌కు ఎన్నికల కమిషన్ భారీ షాక్.. వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్
ఈనేపథ్యంలో తన ప్రసంగాల్లో సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
EC Notice to YS Jagan : 48 గంటల్లో వివరణ ఇవ్వండి
తన ప్రసంగంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సీఎం జగన్ కు నోటీసులు పంపించారు.
ఒకవేళ 48 గంటల్లోగా జగన్.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించకపోతే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని సీఈవో తెలిపారు. చంద్రబాబును పశుపతితో పోల్చుతూ సీఎం జగన్ తన ప్రసంగాల్లో వ్యాఖ్యలు చేశారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అని.. ఇంకా చంద్రబాబుపై దారుణంగా వ్యాఖ్యలు చేయడంపై దానికి సంబంధించిన ఆధారాల వీడియోలతో సహా ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. వాటిని పరిశీలించిన ఎన్నికల కమిషనర్.. అవి కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. మరి.. ఈ నోటీసులపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.