కాకినాడలో ఉత్పత్తికి సిద్ధమైన పెన్సులిన్ జి ఫార్మా యూనిట్
రూ.2,205 కోట్లతో 3వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మా ఉత్పత్తు కోసం ఆ రాష్ట్ర సీఎం జగన్ మోహన్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించారు. కాగా ప్రస్తుతం కాకినాడలో మరో భారీ ఫార్మా సంస్థ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్) స్కీం కింద లిఫియస్ పేరుతో అరబిందో గ్రూపు పెన్సులిన్ జీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులినీ జీని పెన్సులిన్ తయారీలో ముడిపదార్థంగా వినియోగిస్తారు. కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసు కొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. కాకినాడలో ఉత్పత్తికి సిద్ధమైన ఈ లిఫియస్ ఫార్మా యూనిట్ ఏటా 15 వేల టన్నుల పెన్సులిన్ జీ యూనిట్, 2వేల టన్నుల సామర్థ్యంతో 7-ఏసీఏ యూనిట్ ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది.
ఈ ఫార్మా యూనిట్ ద్వారా 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ ప్రారంభానికి సద్ధమవడంతో ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని నియామకాలకు ఇంటర్యూల ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్ ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 22న హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్టు వద్ద ఉన్న మనోహర్ హోటల్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహచేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫెర్మిటేషన్, పొడక్షన్, మైక్రోబయోలజీ రంగాల్లో నియామకాలకు 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం కల్పిస్తోంది. వాటర్ ట్రీట్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని సూచించింది. మరో రెండు ఫార్మా యూనిట్లు లిఫియస్కు సమీపంలోనే ఏర్పాటవుతున్నాయి.
అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2వేల కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందు కసరత్తు చేస్తోంది. దీనికి సమీపంలోనే దివీస్ సంస్థ మరో ఫార్మా యూనిట్ ను నిర్మిస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ మూడు యూనిట్లతో కాకినాడ ఓ పెద్ద ఫార్మా హబ్ గా ఏర్పటు కావడానికి అవకాశం ఉంది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి వస్తే మరిన్ని పరిశ్రమలు రాబట్టేందుకు అపారమైన కృషి చేయనున్నారు. ఏపీని దేశంలోనే పెట్టుబడుల ప్రోత్సాహంలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.