TDP Candidate Gottipati Lakshmi : ఎన్నికల ప్రచారాన్ని మధ్యలో వదిలేసి ఆపరేషన్ చేసిన టీడీపీ అభ్యర్థిని..
అధికార వైసీపీ ఒకవైపు అయితే.. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మరోవైపు అన్నట్టుగా ఉంది. ఏపీలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ రెండు ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఓటర్ ఒకేసారి రెండు ఓట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఓ మహిళా నేత ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఓ ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి అర్జెంట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.
టీడీపీ పార్టీ నుంచి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె ఒక గైనకాలజిస్ట్. వృత్తి రిత్యా డాక్టర్ అయినప్పటికీ రాజకీయాల్లో ఆమె చురుకుగా పాల్గొంటారు. ఎన్నో సామాజిక సేవలు చేస్తుంటారు. అందుకే.. ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు..
దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చారు. దీంతో ఆమె దర్శి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రోజంతా బిజీ షెడ్యూల్. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండటం లేదు ఆమె. కానీ.. ఎంతో ముఖ్యమైన ఎన్నికల ప్రచారాన్ని సడెన్ గా వదిలేసి అర్జెంట్ గా ఆసుపత్రికి వెళ్లి ఓ ఆపరేషన్ చేశారు.
TDP Candidate Gottipati Lakshmi : గర్భిణీకి ఆపరేషన్ చేసి నిండు బిడ్డ ప్రాణాలు కాపాడిన లక్ష్మి
తనకు దగ్గర్లోని ఓ ఆసుపత్రిలో ఓ గర్భిణీకి డెలివరీ అవ్వడం లేదని.. చాలా ఇబ్బందిగా ఉందని.. లేట్ అయితే కడుపులోని బిడ్డ, తల్లి ప్రాణాలకు ప్రమాదం అని తెలుసుకున్న లక్ష్మీ వెంటనే ఆ ఆసుపత్రికి వెళ్లి సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డ ఇద్దరినీ కాపాడారు.
తను చేసిన గొప్ప పనికి హేట్సాఫ్ అంటూ టీడీపీ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఆ వీడియోను షేర్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తను చేసిన పనికి మెచ్చుకున్నారు. గుడ్ జాబ్ అంటూ కామెంట్ చేశారు. వైసీపీ నేతలు దళితులను చంపేసి, డోర్ డెలివరీ చేస్తున్నారు.
కానీ టీడీపీలో మాత్రం ప్రాణం పోస్తున్న నేతలు ఉన్నారు. దర్శి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి తన మానవత్వాన్ని చూపించారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు.. అని టీడీపీ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ డాక్టర్ ను మెచ్చుకుంటున్నారు. డాక్టర్ అంటే కనిపించే దైవం అని, అత్యవసర సమయంలో తన ముఖ్యమైన పనులు కూడా వదిలేసి ఇద్దరు ప్రాణాలను కాపాడిన మీకు హేట్సాఫ్ అంటూ నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.