YS sunitha : పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వైయస్ సునీత...లక్ష్యం ఇదే...

YS sunitha :  పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వైయస్ సునీత...లక్ష్యం ఇదే...

YS sunitha : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజుల నుండి కడప జిల్లాలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కడప లోక్ సభ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానంటూ వైయస్ షర్మిల ప్రకటించడంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పాలి.

ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలో వివేకానంద భార్య సౌభాగ్యమ్మ పోటీ చేస్తారంటూ ప్రచారాలు కూడా తెరపైకి రావడం జరిగింది. ఇలాంటి తరుణంలోనే వైయస్ వివేకానంద కూతురు సునీత రానున్న ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీపై అలాగే తన లక్ష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

600 -3

Read Also మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?

అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనవంతు భాగంగా జగన్ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని వైయస్ షర్మిల మరియు సునీత చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా వీరిద్దరి లక్ష్యం అవినాష్ రెడ్డి అని వార్తలు తెరపైకి వస్తున్నాయి.ఎందుకంటే వైసీపీ పార్టీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం , షర్మిల సునీత తట్టుకోలేకపోతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తన చిన్నాన కోరిక మేరకు తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించింది.

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

దీంతో వైయస్ షర్మిలకు తన పూర్తి మద్దతు కచ్చితంగా ఉంటుందని వైయస్  సునీత కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా  ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సునీత తన రాజకీయ ఎంట్రీపై అలాగే రాజకీయ లక్ష్యంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను  రాజకీయాల్లోకి రావడం లేదని తెలియజేశారు. కానీ రానున్న ఎన్నికల్లో కడప జిల్లాలో అవినాష్ రెడ్డిని ఓడించడమే తన ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా సునీత పేర్కొన్నారు.

అలా అని తన పోరాటం రాజకీయం కోసం కాదని న్యాయం కోసం మాత్రమే అంటూ సునీత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నా కుటుంబ సభ్యులే నా తండ్రిని చంపుతారని మొదట నేను నమ్మలేదు...ఇది నేను చేసిన పొరపాటే అంటూ సునీత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఫర్ వివేక పేరుతో మీడియాతో ముచ్చటించిన సునీత..2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా వివరించారు.

600 -2

దీనిలో భాగంగానే 2014 ఎన్నికల్లో కడప జిల్లా నుండి షర్మిల పోటీ చేస్తారని అంతా భావించారని , కానీ ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి  కేటాయించారని అది వివేకానందకు ఏమాత్రం నచ్చలేదని తెలిపారు. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద ఓటమిపాలయ్యారని...ఇక ఆ ఓటమికి కారణం అవినాష్ కుటుంబం వెన్నుపోటు అని తర్వాత వెళ్లడైనట్లుగా తెలిపారు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా వివేక కోలుకుని 2019 ఎన్నికలకు సిద్ధమయ్యారని సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జగన్ పాదయాత్రలో వివేక కూడా అప్పుడప్పుడు వచ్చి కలిసే వారిని...ఇక ఈ కాలక్రమంలోనే పులివెందులలో వివేక ఓటు కూడా లేకుండా పోయిందంటూ సునీత తెలియజేశారు.

ఇది ఇలా ఉండగా తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినప్పటికీ అవినాష్ రెడ్డి ని  ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారని సునీత బహిరంగంగానే వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్  కడప రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?