మిల్లుల్లో అమ్మిన సన్నధాన్యంకు బోనస్ ఇవ్వాలి 

 రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ చైర్మన్  చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 

 మిల్లుల్లో అమ్మిన సన్నధాన్యంకు బోనస్ ఇవ్వాలి 

మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో పండించిన సన్నధాన్యంను రైస్ మిల్లుల్లో అమ్మిన రైతుల‌కు ప్రభుత్వం రూ 500 బోనస్ అందజేయాలని రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు ఇంత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడ మండలం యాదిగారిపల్లి, అవంతిపురం రైస్ మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్ళను ఆయన సోమవారం పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


రైతుల తెచ్చిన సన్న ధాన్యంను పరిశీలించి  వారికి మిల్లుల వారిచ్చిన ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేమ శాతం కారణంగా సన్న ధాన్యంను రైతులు రైస్ మిల్లులోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నందున దీని గురించి జిల్లా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి సమగ్రంగా వివరించాలన్నారు. 

Read Also రెండు  కంచు గంటలు అందజేత


గత వానకాలం సీజన్లో క్వింటాలుకు 2600 నుంచి 2700 వరకు సన్నధాన్యంకు ధర లభించాయని ఈ సారి 2200 రూ. కే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రైతుబంధు, రైతు భరోసా, ప్రభుత్వం  ఇవ్వలేదని బోనస్ కూడా వర్తింపచేయక పోతే రైతులు అన్యాయమైపోతారని అన్నారు. పెట్టుబడి వ్యయం మూడింతలు పెరిగిందని రైతులకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. 

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!


 తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఇస్తే రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు.  ఐకెపి మార్కెట్ లో అమ్మిన ధాన్యంకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడం ప్రభుత్వం బోనస్ ఎగవేతకు చేసిన కుట్రని ఆరోపించారు. ఎంతో శ్రమపడి పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించేలా బోనస్ వర్తింపజేయాలని కోరారు.

Read Also టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?