భూ భారతితో రైతులకు మేలు..:- రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

భూ భారతితో రైతులకు మేలు..:- రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 21, (క్విక్ టుడే న్యూస్) : భూ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి (భూమి హక్కుల చట్టం -2025 ) పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా సోమవారం మహేశ్వరంలోని కాకి ఈశ్వర్ ముదిరాజ్ ఫంక్షన్
హాల్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్
 ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
          ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధరణి సమయంలో భూముల సమస్యలు పరిష్కారం జరగక రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం భూ భారతి  ద్వారా కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ చట్టంపై రైతులందరూ పూర్తిస్థాయిలో
అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఆర్ఓఆర్ అప్డేషన్ చేసే అవకాశం లేదని, భూ భారతిలో అప్డేట్ చేసే అవకాశం ఉందని,  మొఖా మీద ఉన్న రైతు తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సవరణ చేసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా సక్సెసన్  విషయంలో సైతం ధరణిలో ఆప్డేషన్ కు అవకాశం లేదని, భూభారతిలో చేసుకోవచ్చని చెప్పారు. సక్సేషన్, మ్యుటేషన్ కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో తహసిల్దారు విచారణ చేసి మ్యుటేషన్ చేయాలని, లేకపోతే 31వ రోజు ఆటోమేటిక్ గా మ్యుటేషన్ అవుతుందన్నారు. భూ భారతి చట్టం ద్వారా 90 శాతం  రైతుల  భూ సమస్యలను పరిష్కారం ఇక్కడే జరుగుతుందని, కేవలం 10 శాతం మాత్రం ఆర్డిఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో ఉంటాయని చెప్పారు. మొఖా మీద ఉన్న వారి  పేర్లను ఖాతాలో  ఎక్కించడం జరుగుతుందని,  అన్ సైన్డ్ ఖాతాలు ఉంటే గతంలో ఉన్న పట్టా పాస్ బుక్ ఆధారంగా చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.  రైతులు భూ భారతి చట్టాన్ని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు.నూతన చట్టానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి రైతులకు,
ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మహేశ్వరం తహశీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250421-WA0075

Read Also నాణ్యతను పాటించని హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?