దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు జాతీయ డెంగ్యూ దినోత్సవం అవగాహన సదస్సు ర్యాలీ తీసిన డాక్టర్ హారిక

దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు జాతీయ డెంగ్యూ దినోత్సవం అవగాహన సదస్సు ర్యాలీ తీసిన డాక్టర్ హారిక

విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో(క్విక్ టుడే న్యూస్):-
అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన.జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు ర్యాలీ జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ హారిక మాట్లాడుతూ దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు దోమల ద్వారా మలేరియా ఫైలేరియా డెంగీ చికెన్ గున్యా మెదడు వాపు జికా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మన ఇంటి పరిసరాలలో సాధారణంగా అనాపిలీస్, క్యూలెక్స్, ఏడీస్, ఆర్మీజరీస్ అనే దోమలు పెరుగుతాయి. డెంగ్యూ అనేది వైరల్ జ్వరము ఎడీస్ అనే దోమకాటు  వలన వ్యాపిస్తుంది. డెంగ్యూ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ దోమ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది.IMG-20250516-WA0032 తలనొప్పి కంటి వెనుక భాగంలో నొప్పి కండరాల నొప్పులు జుట్టు ఊడిపోవడం చర్మము పై గుండ్రటి ఎర్రని మచ్చలు మొదలగునవి డెంగ్యూ లక్షణాల్లో ముఖ్యమైనవి. డెంగ్యూ వ్యాధి రాకుండా  దోమ తెరలు కట్టు కోవడం వలన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం నీరు నిలవ లేకుండా చూసుకోవడం వలన డెంగ్యూ వ్యాధి చాలా వరకు అరికట్టవచ్చు. ఈ కార్యక్రమంలో డాక్టర్. జయశ్రీ కరిష్మా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం. ఎస్. ఎస్ సాయిరాం పి.హెచ్. ఎన్.జానకిరామన్,ఆప్తాల్మిక్ ఆఫీసర్ వెంకటరావు, స్టాఫ్ నర్స్ చైతన్య, ఫార్మసిస్ట్ విజయ కుమారి, ఎల్. టి అన్నపూర్ణేశ్వరి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?