బోడుప్పల్ , ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్):-మంగళవారం బోడుప్పల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పెద్ది దామోదర్ గెజిటెడ్ హెడ్మాస్టర్ ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ది దామోదర్ ఉపాధ్యాయ వృత్తిలో 42 ఏళ్లు తమ సేవలందించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. అందరికీ ఆదర్శవంతంగా ఉంటూ తన వృత్తికి తగిన న్యాయం చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లు అయితే వృద్ధాప్య వయస్సు 80 ఏళ్లుగా ఉంటుందని అన్నారు. పదవీ విరమణ పొందినంత మాత్రాన తమ వయస్సు అయిపోయిందని భావించొద్దని తెలిపారు. ఇంకో 20 ఏళ్లపాటు ఏదో ఒక పని చేస్తూ ఆదర్శంగా జీవించాలని సూచించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు పెద్ది దామోదర్ దంపతులను ఘనంగా సత్కరించారు. పెద్ది దామోదర్ అందించిన సేవల సందర్భంగా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ గణిత ఉపాధ్యాయులు కాసుల మధుమోహన్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. విశిష్ట అతిథిగా రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సదానందం గౌడ్, ప్రత్యేక అతిధులుగా జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు, ఎం సుధాకర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టిపియూఎస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్, అర్జున్, జిహెచ్ఎం సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ, శ్రీ రామ్ రెడ్డి, మేడిపల్లి మండల విద్యాధికారి గాయం శ్రీనివాస్ రెడ్డి, ఘట్కేసర్ మండల విద్యాధికారి శ్రీ ధర్, డి సి ఈ బి సెక్రెటరీ జి సురేష్, ఏ సి జి ఈ పాపిరెడ్డి, జెడ్ పి హెచ్ ఎస్ బోడుప్పల్ పూర్వ ప్రధానోపాధ్యాయులు మన్యం శ్రీనివాస్ రెడ్డి, ఈ సభకి సంధానకర్తగా జి అశోక్ కుమార్, జడ్పీహెచ్ఎస్ బోడుప్పల్ ఉపాధ్యాయ బృందం రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, విద్యాసాగర్ గారు శ్రీ మార్టిన్ గారు శ్రీ ప్రేమ్ కుమార్ గారు శ్రీమతి సరస్వతి గారు శ్రీమతి జ్యోతి గారు శ్రీమతి శ్రీదేవి , భాగ్యలక్ష్మి, సత్యవతి, సునీత, మంజుల, సంధ్య, ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
