CM Revanth Reddy : పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు
భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. నిజంగా ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన ఊళ్లల్లో ఓట్లు అడుగాలని, మేం ఏ ఊళ్లల్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో అక్కడ మేము ఓట్లు అడుగుతామని మాజీ సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హులందరికీ మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తుందని అన్నారు. కట్టు కథలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, అందుకే ఆయన ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు బొందపెట్టారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ కు అనుబంధం ఉందని అన్నారు.
అందుకే 2014, 2016, 2003 ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ మోసపు మాటలను ఖమ్మం ప్రజలు నమ్మలేదని వివరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. భద్రాద్రి శ్రీరాముడి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.