కారులో తరలిస్తున్న 400 కిలోల బెల్లం,పట్టిక స్వాధీనం

కారులో తరలిస్తున్న 400 కిలోల బెల్లం,పట్టిక స్వాధీనం

తొర్రూరు ఏప్రిల్ 15:- తొర్రూర్ ఎక్సైజ్ పరిధిలో కారులో అక్రమంగా రవాణా చేస్తున్న  గుడుంబాకు తయారు చేసే బెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. బాలరాజు తెలిపారు.మంగళవారం ఈ సందర్భంగా మాట్లాడుతూ... నమ్మదగిన సమాచారం మేరకు  రూట్ వాచ్ చేస్తుండగా మండలంలోని వెలికట్ట ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా కారు టీఎస్ 24 ఎఫ్0796 నెంబర్ గల గుడుంబాకు వినియోగించే 400 కిలోల బెల్లం పట్టికను పట్టుకున్నమని,బెల్లాన్ని రవాణా చేస్తున్న చంగల రాజేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తాను గతంలో కూడా రవాణా చేశానని చెప్పాడన్నారు. ఇరవై పెట్టాల బెల్లం రెండు బస్తాల పట్టికను తీసుకువచ్చి తొర్రూర్ పరిధిలో గల పడమటి తండా తదితర ప్రాంతాల్లో అక్రమ రవాణా చేస్తున్నాడని పది లక్షల విలువైన కారును, బెల్లం ను పట్టికని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ బాలరాజు మాట్లాడుతూ..ముడి పదార్థాలను క్రయ విక్రయాలు చేసిన  గుడుంబా తయారీ పాల్పడిన కేసులు తప్పవని అన్నారు.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది యాదగిరి,నితిన్,అనిత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250415-WA0026

Read Also ఉమాశంకర్ గుప్తాకు సామాజిక సేవరత్న అవార్డు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?