Hydraa: గృహప్రవేశం చేసిన ఆరో రోజుకి హైడ్రా కూల్చివేత... శిథిలాల వద్దె లబోదిబోమంటున్న బాధితుడు?
ప్రస్తుతం ఒక యజమాని కేవలం గృహప్రవేశం చేసిన వారం రోజులకి ఇంటిని కూల్చిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఎన్నో కోరికల ప్రకారం సొంత ఇంటిని నెరవేర్చుకోవాలని కళతో ఒడిశా నుండి వచ్చి మరి హైదరాబాదులో ఇల్లు కొనుక్కొని ఎంతో చక్కగా కొన్ని లక్షలు పెట్టి ఇంటిని నిర్మించాడు. అయితే ఆ ఇల్లు నిర్మాణం పూర్తయిన తరువాత ఎంతో ఘనంగా గృహప్రవేశం కూడా చేశాడు. కానీ గృహప్రవేశం చేసిన వారం రోజులకి అతని ఇంటిని హైడ్రా కూల్చివేసింది. దీంతో ఆ బాధితుడు పడగొట్టిన శిథిలాల మధ్యనే లబోదిబోమంటూ అక్కడే ఉండిపోయాడు.
ఇక అసలు విషయానికి వస్తే ఒడిశాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి 1998లో హైదరాబాదులో టర్బో పరిశ్రమలో ఉద్యోగం చేసేవాడు. 2009లో సత్యనారాయణ మళ్ళీ ఒడిశా వెళ్లిపోయాడు. అయితే వాళ్ల కొడుక్కి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగా ఇక హైదరాబాదులోనే సెటిల్ అవుదాం అనుకొని తిరిగి హైదరాబాదుకి వచ్చారు. ఇక హైదరాబాదులోనే పూర్తిగా ఉండాలని అనుకుని తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నిటినీ కూడా కట్టుకొని సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలో పటేల్ గూడలో 167 గజాల ఫ్లాట్ ని కొనుగోలు చేశాడు.
ఈ కొనుగోలు చేసే సమయంలో ఈ స్థలం పత్రాలు అలాగే అన్ని రకాల నుండి అనుమతులు కూడా తీసుకొని వచ్చి మరి ఇల్లు కట్టుకున్నాడు. ఎంతో ఘనంగా తన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్ని కలుపుకొని కొన్ని లక్షల ఖర్చు చేసి తన సొంత ఇంటి కలను హైదరాబాదులో నెరవేర్చుకున్నాడు. అయితే ఇంతలోనే అతని కళ అనేది ఆవిరై పోయింది. హైడ్రా పేరుతో తన ఇంటిని ఇది ప్రభుత్వ స్థలమని అతను గృహప్రవేశం చేసుకున్న వారానికి పూర్తిగా పడగొట్టారు. అతను ఆ ఇంటిని సెప్టెంబర్ 15వ తారీఖున గృహప్రవేశం చేసుకోగా తన భార్యకి బాగా లేదని తెలిసి హాస్పటల్కి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నాడు.
అదే సమయంలో అతని ఇంటికి హైడ్రా అధికారులు ఇది ప్రభుత్వ స్థలం అని తద్వారా కూల్చి వేస్తున్నామని పేపర్లు ఇంటికి అతికించి వెళ్లిపోయారు. కానీ అవి అతను చూడకుండా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇక సెప్టెంబర్ 22వ తారీఖున ఆ ఇంటిని కూల్చి వేయడంతో అక్కడ ఉన్నటువంటి వారు అతనికి ఫోన్ చేసి ఇల్లు కూల్చి వేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఆ వెంటనే ఆ ఇంటిని చూడడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అడ్డుకొని వెళ్ళనివ్వలేదు. ఇక హైడ్రా వెంటనే ఇంటిలోని సామాన్లు అన్ని బయటపడేసి ఇక ఇంటిని పూర్తిగా పడగొట్టేశారు. దీంతో అతనికి ఇంకా ఏమి చేయాలో అర్థం కాలేదు.
అయితే అతను ఆ కూల్చి వేసిన ఇంటి దగ్గర శిధిలాలలోనే ఉంటూ బోరు నా ఏడుస్తున్నాడు. అన్ని అధికారుల నుండి అనుమతి పత్రాలు తీసుకున్నాక ఇల్లు పడగొట్టడం ఏంటని ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ అదృశ్యాన్ని చూసిన పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా చాలా బాధకి లోనయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన అతను స్థలం అధికారులను సంప్రదించి ఏంటిది అని అడగగా వాళ్లు ఇది ప్రైవేట్ స్థలమే ఎందుకు కూల్చారో మాకు కూడా అర్థం కావట్లేదు దీని గురించి అధికారులతో మాట్లాడదామని చెప్పుకొచ్చారట.
ఇక ఇన్ని చేసిన ఏమి ఉపయోగం మొత్తం పడి వేసిన తర్వాత అని ఆ బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఎంతో పేరు ఉన్న అక్కినేని నాగార్జున ఇంటిని కూల్చివేశారంటే ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని ప్రోత్సహించారు. అటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎల్ల ప్రజలను కూల్చివేయడంతో అందరూ కూడా రేవంత్ రెడ్డి పై చాలా మండిపడుతున్నారు.
ఏమి చేసినా ఇప్పుడు ఉపయోగం లేదని మళ్ళీ ఎలక్షన్స్ లో మిమ్మల్ని ఎలా గెలిపించుకుంటామని అందరూ కూడా అంటున్నారు. మరి ఈ హైడ్రా తెలంగాణ ప్రజలకు ఒక పాలిట శాపంగా మారిందా.. లేదా అనేది వచ్చే ఎలక్షన్లలో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఈ బాధితులు శిథిలాల మధ్య ఉంటూ చాలా బాధపడుతూ ఉంటూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు.