ఉగ్రవాదుల చేతుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలి..

ఉగ్రవాదుల చేతుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలి..

మాడుగులపల్లి, ఏప్రిల్ 23 :- ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్ లోని పహేల్గంలో 26 మంది పర్యాటకులపై పాకిస్తాన్ కు చెందిన లస్కర్ ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ బుధవారం మాడుగులపల్లి మండల కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షుడు ఇటికల జాన్ రెడ్డి ఆధ్వర్యంలో పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు ఘటించడం జరిగింది. జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు వెంకటరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రహ్మకంటి నరసింహ మాట్లాడుతూ అమాయక పర్యటకుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఉగ్రవాద సంస్థల పిరికి చర్యగా భావించారు. శాంతి భద్రతలకు వివాదం కలిగించే ఈ ఉగ్రవాద సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని, ఉగ్రవాద సంస్థలు ఎక్కడ ఉన్నా వెతికి ఆ స్థావరాలపై దాడి చేసి లేకుండా చేయాలని, ఆ దిశగా మన భారతీయ జవాన్లు తక్షణ చర్యలు తీసుకొని, ఉగ్రవాదుల చేతుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని, అందుకు హిందూ సైన్యం అంతా ఏకం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పల్నాటి రామ్ రెడ్డి, రాచకొండ దశరథ, వేముల లక్ష్మణ్, దాసరి యాదగిరి, మర్రి నాగరాజు, దారమల్ల నాగరాజు, రాజవరపు గురుస్వామి, చిలుముల శ్రీనివాసరెడ్డి, కడారి వెంకటరెడ్డి, గంగరాజు, బోలగాని ప్రభాకర్ గౌడ్, బూతు అధ్యక్షులు నల్లబోతు సైదులు, వెంకటరెడ్డి, సిద్ధంకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250423-WA0070

Read Also జిల్లా సబ్ జైలును సందర్శించిన జిల్లా  న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?