ఈసారైనా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా..?

ఈసారైనా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా..?

 మిర్యాలగూడ, మే 11 (క్విక్ టుడే న్యూస్):-తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వ్యాపార వ్యవస్థగా మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యని అందించాలని, నిబంధనలు ఉన్న వాటి అమలు మాత్రం నేటికీ శూన్యం, తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కార్పొరేట్ మాఫియా దోపిడిని అరికట్టడంలో నేటికీ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులు చదువుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయిందని, అడ్మిషన్ల పేరిట పెద్ద మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడమే కాక, పాఠశాల ఫీజులు అత్యధికంగా ఉండడం వలన పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేటు పాఠశాల విద్య కి నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఈసారైనా పేద విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% పేద విద్యార్థులు చదువుకునేలా చర్యలు తీసుకొని, అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చదివించాలి అంటే తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని, విద్యా ని వ్యాపారం చేసి లక్షల రూపాయలు దోసుకుంటున్న యాజమాన్యాల పై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జయరాజ్, మురళీ యాదవ్, ఉపేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250511-WA0127

Read Also నూతన వస్త్రములు పంపిణి చేసిన 'నిశ్చల' సేవ సంస్థ

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?