అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

హుజుర్ నగర్, క్విక్ టుడే న్యూస్ : దేశ రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.హుజూర్ నగర్ లోని ఆనంద్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రిటైర్డ్ ఎంఈఓ ఎంబీ. దేవదానం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అంబేద్కర్ బహుభాషా కోవిదుడని, ఇంగ్లీష్, సంస్కృతం, పాళి, హిందీ, మరాఠా, బెంగాలీ, కొంకిని వంటి భాషలపై ఎంతో పట్టు ఉందని పేర్కొన్నారు. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. విద్యా, ఉపాధి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాలకు రిఙర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి పాటు బడ్డారని గుర్తు చేశారు. రాజ్యాంగ రూప కల్పనలో ప్రముఖ పాత్ర పోషించి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య, లౌకిక వాద రాజ్యాంగాన్ని ప్రజలకు అందించారని తెలిపారు. కార్యక్రమంలో షాలోమ్ చర్చి పాస్టర్ జీజే కాంత రావు, డాక్టర్ డానియల్, దారా అనిల్ కుమార్, వై ఆనంద్ రావు, నవీన్, మదన్ లాల్, చిడిపి పుష్ప రాజ్, గుండు ఉపేందర్, వి భూషణం, హొలీ క్రాస్ ఫౌండేషన్ ఫౌండర్ మాడుగుల ఉదయ కుమార్, పలువురు అంబేద్కరిస్టులు, బహుజన వాదులు, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read Also జిల్లా సబ్ జైలును సందర్శించిన జిల్లా  న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?