ప్రజా సమస్యల పరిష్కార పోరాట వేదిక రిలే దీక్షలకు వ్యాపార వర్గాల మద్దతు..

ప్రజా సమస్యల పరిష్కార పోరాట వేదిక రిలే దీక్షలకు వ్యాపార వర్గాల మద్దతు..

తొర్రూరు ఏప్రిల్ 16:- తొర్రూర్ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని గత మూడు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా విచ్చేసి ఈ ప్రాంత సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ అన్నారు. బుధవారం అమరవీరుల స్తూపం దగ్గర గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను తొర్రూరు వ్యాపార వర్గాలు సందర్శించి ఈ పోరాటానికి మద్దతు తెలియజేయడం జరిగింది. అనంతరం తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ మాట్లాడుతూ...తొర్రూరు రెవెన్యూ డివిజన్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉండవలసిన ప్రభుత్వ కార్యాలయాలు కానీ సౌకర్యాలు గాని లేకపోవడం దురదృష్టకరమని వారు అన్నారు.గత ప్రభుత్వంలోనే మంజూరైన వంద పడకల ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో కాకుండా దూరంగా నిర్మించే ఆలోచనలను విరమించుకోని, ప్రజలకు అందుబాటులో ఉండే తొర్రూరు పశువుల సంతలో ఆసుపత్రి నిర్మాణం చేపడితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని వారు అన్నారు.తొర్రూర్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏటీవో కార్యాలయం ఫైర్ స్టేషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. గత రెండు సంవత్సరాలుగా అనేక రూపాల్లో చేస్తున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార పోరాట వేదికకు వారు అభినందనలు తెలిపారు. ఈ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికైనా తొర్రూరు పట్టణo వ్యాపార వర్గాల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు,చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి హీరదర్,సిహెచ్ శ్రీనివాస్, తోట శ్రీనివాస్,సత్యనారాయణ, జయప్రకాశ్,చక్రపాణి, బిజ్జాల వెంకటరమణ,అమరేందర్, వనమాల ప్రకాష్, మరియు బీఎస్పీ పార్టీ నాయకులు ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు..ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాపాక శ్రీశైలం నియోజకవర్గ అధ్యక్షులు ఈదునూరి ప్రసాద్, సురేష్ బాబు మద్దతు తెలియజేశారు.తొర్రూరు ప్రాంత ప్రజా సమస్యల పరిష్కార వేదిక కన్వీనర్ తమ్మేర విశ్వేశ్వరరావు,కో కన్వీనర్లు బొల్లం అశోక్, కొత్తపల్లి రవి, ఊడుగుల లింగన్న, ఆలకుంట్ల సాయిలు, ఎండి యాకుబ్, ముంజపెళ్లి వీరన్న, బందు మహేందర్ ,లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, మల్లయ్య,చింతల నవీన్, వల్లపు సాయిలు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

IMG-20250416-WA0040

Read Also తొర్రూరు ట్యాంక్ బండ్,చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?