వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతు మృతి

వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతు మృతి

 తొర్రూర్ ఏప్రిల్ 21(క్విక్ టుడే న్యూస్):- మండల పరిధిలోని చర్లపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు హనుమాండ్ల ప్రేమలత తాము పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎండబోసి   పనిచేస్తుండగా ఎండ దెబ్బ తాకి తాను అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్  హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని తెలుసుకొని తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అనంతరం మృతురాలి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు.దీంతోపాటు వెంటనే సంబంధిత రెవెన్యూ పోలీస్అధికారులకు డిఎంహెచ్ఓ తో మాట్లాడి పోస్టుమార్టం వెంటనే జరిపించ వలసిందిగా కోరారు. అనంతరం వారు మీడియా ముందు మాట్లాడుతూ.. అకస్మాత్తుగా చనిపోయిన వ్యక్తి పట్ల సంఘీభావం తెలుపుతూ తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే ద్వారా మంత్రులతో చర్చించి వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తొర్రూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రామచంద్రయ్య,చర్లపాలెం గ్రామ  పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కందాడి అశోక్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమాండ్ల దేవేందర్ రెడ్డి,గంజి ప్రసాద్ రెడ్డి తోపాటు వివిధ ముఖ్య నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250421-WA0069

Read Also అమెరికాతో ఒప్పందం.. భారత వ్యవసాయ రంగానికి ఉరితాడు లాంటిది!

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?