గ్రామ పోలీసు అధికారుల ద్వారా ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం

గ్రామ పోలీసు అధికారుల ద్వారా ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం

మాడుగులపల్లి, ఏప్రిల్ 15 (క్విక్ టుడే న్యూస్):- గ్రామ పోలీసు అధికారులు ద్వారా జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు, ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం కలుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. మంగళవారం నాడు నల్లగొండ జిల్లా గౌరవ ఎస్పి శరత్ చంద్ర పవర్ మాడుగులపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూర్ గ్రామాని సందర్శించి మాట్లాడుతూ విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలుకు మెరుగైన  సేవలు, సత్వర ప్రజా సమస్యల పరిష్కారం పొంద వచ్చననీ అన్నారు. ప్రజలకు మరియు పోలీసులకు మధ్య సత్సoబంధాలు ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యం అవుతుందని, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. గ్రామాల్లో కి కొత్తగా వచ్చే అనుమానుమనితుల యొక్క  సమాచారం ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలు విలేజ్ పోలీస్ అధికారికి అందించడం ద్వారా, గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలో ఏ యొక్క సమస్య ఉన్న, విపిఓ తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలు సత్వరమే తీర్చడానికి కృషి చేయడం జరుగుతుందనీ అన్నారు. గ్రామాల్లో  సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా, మీసేజ్ ల ద్వారా మీ యొక్క సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితులలో ఎవరికి సమాచారం అందించకూడదని అన్నారు. అలాగే యువత మాదక ద్రవ్యాలకి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండి, గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఎవరైనా గ్రామంలో గాంజా ఇతర మాదకద్రవ్యాలు క్రయ విక్రయాలు చేస్తే వెంటనే సమాచారం అందించాలని, మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో గ్రామంలో ముగ్గురికి ఉపాధి అవకాశం కలిగినందుకు అభినందనలు తెలిపారు. ఇలాగే యువత గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ  రాజశేఖర్ రాజు, రూరల  సిఐ పి.యం.డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య, వీపీఓ సైది రెడ్డి, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

IMG-20250416-WA0002

Read Also తెలంగాణ‌కు మొద‌టి విల‌న్ కాంగ్రెస్‌:-కేసీఆర్‌

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?