అమెరికాతో ఒప్పందం.. భారత వ్యవసాయ రంగానికి ఉరితాడు లాంటిది!

అమెరికాతో ఒప్పందం.. భారత వ్యవసాయ రంగానికి ఉరితాడు లాంటిది!

తొర్రూరు ఏప్రిల్ 21(క్విక్ టుడే న్యూస్):- భారత్, అమెరికా స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమ, మత్స్య రంగానికి నష్టం చేసే ఒప్పందాలు చేసుకుంటే ఈ భారత రైతాంగానికి ఉరితాళ్ళుగా మారుతాయి అని కిసాన్ సంయుక్త మోర్చా నాయకులు ముంజంపల్లి వీరన్న, ఎండి యాకుబ్, ఊడుగుల లింగయ్య ఆలకుంట్ల సాయిలు  అన్నారు. సోమవారం రోజు తొర్రూర్ మండల కేంద్రం గాంధీ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ మార్కెట్   ఒప్పందాలను రద్దు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్ రాకకు వ్యతిరేకంగా  తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. అమెరికాతో భారతదేశ ఒప్పందాలకు  దేశ వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాద బహుళ  జాతి కంపెనీలకు అప్పజెప్పి మోడీ దేశద్రోహానికి పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారత వ్యవసాయ రంగం ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు పాలు చేపలు తదితర వృత్తుల్లో కోట్లాదిమంది జీవిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటే ఒక కలం పోటుతో వారి బతుకుల్లో నిప్పు లు పోస్తున్న  మోడీ కుహనా దేశభక్తిని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని అన్నారు. గతంలో ఢిల్లీ మహానగరంలో రైతాంగం 13 నెలలు ఆందోళన చేసి మోడీ మెడలు వంచిన చారిత్రాత్మక పోరాటాన్ని మరిచిపోరాదని వారు గుర్తు చేశారు. భారత రాజ్యాంగం అది ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడవేస్తే చూస్తూ దేశ ప్రజలు సహించరని హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడితో నేడు సంతకం చేయబోతున్న పొందాలని ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు చిన్న వృత్తులు కార్మికులు అన్ని రంగాల ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్కేఎం నాయకులు బొల్లం అశోక్ ,జమ్ముల శ్రీను, ఏకాంతం, వల్లపు సాయిలు, గద్దల వెంకటయ్య, గజ్జి యాకయ్య, యాకుబ్, నాగరబోయిన సంపత్, అనిల్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

IMG-20250421-WA0054

Read Also విలేక‌రిని బెదిరించిన మాజీ కార్పొరేట‌ర్‌ దాన‌గ‌ళ్ల యాద‌గిరి.. మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసిన మేడిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?