డెంగ్యూ వ్యాధి జాతీయ దినోత్సవ అవగాహన ర్యాలీ 

డెంగ్యూ వ్యాధి జాతీయ దినోత్సవ అవగాహన ర్యాలీ 

అచ్చంపేట, మే 16(క్విక్ టు డే నాగర్ కర్నూల్  జిల్లా:-  అచ్చంపేటప్రాంతీయఆసుపత్రిఆవరణలో అచ్చంపేట జిల్లావైద్యమరియుఆరోగ్యశాఖ అధికారి డాక్టర్  తారా సింగ్   జాతీయ డెంగ్యూ దినోత్సవఅవగాహనర్యాలీనిశుక్ర వారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగాడిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తారాసింగ్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి  లక్షణాలు,నివారణ గురించిప్రతిఒక్కరూఅవగాహన కలిగి ఉండేలా ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకుఅర్థమయ్యేవిధంగాఅవగాహనకార్యక్రమాలునిర్వహించాలని ఆయనసూచించారు. IMG-20250516-WA0019ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం ప్రకారం ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో, ఇంటి ఆవరణ,పరిసరాలలో గల నీటిలో దోమ యొక్క లార్వాలను గుర్తించి, వాటిని తొలగించిశుభ్రపరచి, నీటి నిల్వలపై మూతలు పెట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధినినివారించవచ్చనితెలిపారు. డెంగ్యూ వ్యాధి  కారక క్రిమి ఫ్లెవీ వైరస్ గల ఆడ టైగర్ దోమ కుట్టడం ద్వారా మనుషులకు డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. దోమ కుట్టిన తర్వాత మూడు నాలుగు రోజులకువిపరీతమైన జ్వరం తలనొప్పి కంటి వెనకాల నొప్పి, కండరాలుమరియు  కీళ్ల నొప్పులు, వాంతులువిరేచనాలు కడుపునొప్పి తదితరలక్షణాలతో బాధపడుతూఉంటారన్నారు.ప్రాథమిక లక్షణాలదశలోని డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధిని గుర్తించి 

ఇంటిద్రావణాలను ,ఓఆర్ఎస్,ద్రావణాలనుతీసుకోవడం ,లేదాజ్వరంతగ్గడానికిపారాసెటమాల్ మాత్రలు వేయడం వల్లడెంగ్యూవ్యాధినిసులభంగాతగ్గించగలంఅనిఅన్నారు. ప్రాథమిక దశలోగుర్తించకపోవడం వల్ల శరీరంలోని మూత్రపిండాలు కాలేయము గుండె మెదడు తదితర అవయవం తీవ్ర ప్రభావానికి గురి అవుతాయి. కావున ప్రజలు దోమలుపుట్టకుండా కుట్టకుండా వ్యక్తిగతంగా శ్రద్ధ జాగ్రత్తలుతీసుకోవాలనితెలిపారు. ప్రజలు తమ  ఇంటిలో ప్రతి శుక్రవారం పోడిదినం(డ్రై డే) పాటించాలి. ఇంటి ఆవరణలో పనికిరాని టైర్లు ప్లాస్టిక్ మూతలు,  సీసాలు,కొబ్బరి చిప్పలు, లేకుండా చేసుకోవాలి. టైగర్ దోమలు పగటిపూట ఉదయము సాయంత్రం కుడతాయి. ఇంటి తలుపులకు కిటికీలకు ఇనుప జాలీలు బిగించుకోవాలి. చిన్నారులకు  చేతులు 
కవర్ అయ్యే విధంగా చొక్కాలు, ప్యాంట్లు సాక్సులు వేయడం ద్వారా 
దోమ కాటు నుంచి రక్షించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని  నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, అచ్చంపేట డివిజన్ ఉప మలేరియా అధికారిబిక్కులాల్, పర్యవేక్షకులు హనుమంతు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also ఈసారైనా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా..?

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?