వీర జవాన్ల త్యాగం వెల కట్టలేనిది

వీర జవాన్ల త్యాగం వెల కట్టలేనిది

మిర్యాలగూడ, మే 11 (క్విక్ టుడే న్యూస్):- దేశ రక్షణ కోసం శత్రు దేశం పాకిస్తాన్ పై వీరోచితంగా పోరాడి, వీర మరణం పొందిన భారత జవాన్ల త్యాగం వెల కట్టలేనిదని బీసీ సంఘం నాయకులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి సత్యనారాయణ, తమ్మడబోయిన అర్జున్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, బీసీ విద్యార్ది సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలగిరి అశోక్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్ లు అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిబాపులే భవనంలో బీసీ జేఏసీ నాయకులు దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్ ఆద్వర్యంలో వేర్పాటు చేసిన అమర జవానుల నివాళి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ వినాశనాన్ని కోరుకుంటున్న పాకిస్తాన్ దుశ్చర్యలను దీటుగా ఎదుర్కోవడంలో ఇండియన్ ఆర్మీ వీరోచిత పోరాటం మరవలేనిదన్నారు. పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో భారత్ ఆర్మీతో పాటు అవసరమైతే ఇంటికొక యువకుడు ఆర్మీల వలే యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాక్ తో జరుగుతున్న యుద్ధంలో ఇండియాదే విజయమని చెప్పారు. దేశ రక్షణలో పోరాడి దేశ ప్రజల సుఖ సంతోషాలు కోరుకుంటున్న ఆర్మీలను తయారు చేసిన వారి తల్లులకు అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా అభినందలు తెలిపారు. కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట కన్వీనర్ మాలోథ్ దశరథ్ నాయక్, వెంకటేశ్వర్లు, బ్రహ్మం, వినోద్, రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250511-WA0128

Read Also ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజ సామాగ్రి వేలం పాట

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?