దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ

దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ

నల్గొండ, మే 12 (క్విక్ టుడే న్యూస్):- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితాన్ని ఆధారంగా తీసుకొని  సినిమా పోస్టర్‌ను నల్లగొండలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు నల్లగొండ జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ పాల్గొని వారు మాట్లాడుతూ ఇది ఒక పోస్టర్ మాత్రమే కాదు. ఇది తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను మేల్కొల్పే ఉద్యమం, దొడ్డి కొమరయ్య వంటి యోధులు ఆత్మగౌరవం కోసం, రైతుల స్వరాజ్యం కోసం ప్రాణాలర్పించారు. IMG-20250512-WA0031ఈ వీరుల చరిత్రను మళ్లీ జీవింపజేయడమే మనకు నైతిక బాధ్యత, బీసీలు చరిత్రలో మాత్రమే కాక, భవిష్యత్తులోనూ నాయకత్వం వహించాల్సిన సమయం ఇది. యువతా కీబోర్డ్ పోరాటాలు కాదు, రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయండి. సమాజాన్ని మార్చాలంటే మీ పాత్ర కీలకం. మహిళలూ దొడ్డి కొమరయ్యలతో పాటు పోరాడిన తెలంగాణ తల్లుల గౌరవాన్ని నిలబెట్టాలంటే మీరు రంగంలోకి రావాలి. మేధావులూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఎదుర్కోవాలి. నిజాయితీకి నిలబడి, సమాజాన్ని అక్షరాల ద్వారా శక్తివంతం చేయండి అని అన్నారు. ఈ సినిమా ఒక కళా ప్రదర్శన కాదు. ఇది ఒక ఉద్యమం, ఇది ఒక చైతన్య రగిలింపు ఈ కార్యక్రమంలో బుడిగపాక సత్యనారాయణ, నాగార్జునసాగర్ బీసీ సమాజ్ కో కన్వీనర్ చిట్టిమల్ల సర్వేశ్, కోమల్ల వెంకటేశ్వర్లు, బీసీ సమాజ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?