పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం

పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం

తొర్రూరు మే 05(క్విక్ టుడే న్యూస్):- పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన స్థానిక సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం సత్కరించింది. సోమవారం డివిజన్ కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో పది లో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ హర్ష, అక్షిత్, గంగోత్రి లను పాఠశాల చైర్మన్ ముత్తినేని సోమేశ్వరరావు, పాఠశాల కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్ లు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు.  సిద్ధార్థ హై స్కూల్ 100 శాతం ఫలితాలతో తిరుగులేని పాఠశాలగా నిలిచింది. మొత్తం 17 మంది విద్యార్థులు పరీక్ష రాయగా దానిలో 10 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించగా, 7 మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా సాధించారు.మండలంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

ఈ సందర్భంగా చైర్మన్ సోమేశ్వర రావు, కరస్పాండెంట్ జయప్రకాష్ మాట్లాడుతూ...గత కొంతకాలంగా సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, వారు మంచి ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల కృషి,  తల్లిదండ్రుల సహకారం ఉందన్నారు. పాఠశాలలో విలువలతో కూడిన విద్య అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను వృద్ధిలోకి తీసుకురావడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు.

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

IMG-20250505-WA0036

Read Also పోరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?