ధాన్యం కొనుగోలు సెంటర్ లో గోల్ మాల్

ధాన్యం కొనుగోలు సెంటర్ లో గోల్ మాల్

తొర్రూర్ మే 10(క్విక్ టుడే న్యూస్):-ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్ట కష్టాలు తప్పడం లేదు.మద్దతు ధర కల్పించే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన వాటిని ఆసరా చేసుకుని నిర్వాహకులు కొందరిని నియమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డివిజన్ పరధిలోని  మండలంలోని హరిపిరాల,గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో  గన్ని బ్యాగులను అమ్ముకుంటూ కొరతను సృష్టిస్తున్న  నిర్వాహకుడు ధనుంజయ్ ఆగడాలకు అంతు లేకుండా పోయింది. దీంతో కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరతతో మండలంలోని హరిపిరాల గ్రామ పిఎసిఎస్ సెంటర్ లో చీకటాయపాలెం  గ్రామానికి చెందిన రైతుకు గన్ని బ్యాగులను అమ్ముకోవడంతో పిఎసిఎస్ సెంటర్ నిర్వాకుడు ధనుంజయ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతి లేకుండా రైతులు అనుమతి లేకుండా బస్తాలను వేరే గ్రామానికి చెందిన రైతులకు అమ్ముకోవడం ఏంటి అని నిలదీశారు, హరిపిరాల గ్రామానికి వచ్చిన బస్తాలను చీకటాయపాలెం గ్రామానికి ఎలా అమ్ముతారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల చేతివాటంతోటి బస్తాలను అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనతో గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసి సెంటర్ నిర్వాహకుని పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

IMG-20250510-WA0055

Read Also వైద్య సేవలో నర్సులు కీలకం

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?