వైద్య సేవలో నర్సులు కీలకం

వైద్య సేవలో నర్సులు కీలకం

తొర్రూరు మే 12(క్విక్ టుడే న్యూస్):- వైద్య సేవల్లో నర్సుల పాత్ర ప్రముఖమైందని  తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు అన్నారు.  అంతర్జాతీయ నర్సుల దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సుగుణాకర్ రాజు మాట్లాడుతూ రోగుల సేవలో తరించిన మహోన్నత వ్యక్తి నైటింగేల్‌ అన్నారు. ఆమె చేసిన సేవలకు పురస్కారంగా నైటింగేల్‌ జన్మదినాన్ని అంత ర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. నర్సింగ్‌ వృత్తి కాదని, అదొక బాధ్యత అని, నర్సింగ్‌ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు ధన్యులన్నారు.  డాక్టర్ల కంటే నర్సులే రోగులతో ఎక్కువ సమయం గడుపుతారన్నారు. రోగికి అవస రమైన సేవలందించడంలో నర్సులే కీలకమని, వారిని గౌరవించడం మన ధర్మమని ఆమె తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి జ్వలిత , మీరాజ్, ప్రియాంక, మానస, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250512-WA0037

Read Also మేడిపల్లి లయన్స్ క్లబ్బు జిల్లాలోనే నెంబర్ వన్ గా ఎదగాలి :డిస్ట్రిక్ట్ గవర్నర్

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?