శివ్వంపేట ఏప్రిల్ 21 (క్విక్ టు డే న్యూస్):- గత పడేండ్ల కెసిఆర్ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త మండలంలో, మండల కేంద్రమైన శివ్వంపేటలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని మండిపడ్డారు. సోమవారం శివ్వంపేటలో జరిగిన విలేఖరుల సమావేశంలో తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగల లక్ష్మీ నరసయ్య కొండల్ మాట్లాడుతూ శివ్వంపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవీన్ గుప్తా తాజా మాజీ జెడ్పిటిసి పై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నానని రమణ గౌడ్ పొద్దున లేచింది మొదలు తన స్వంతంగా ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ముందుండేదే మహేష్ గుప్త అని అన్నారు.మాజీ జడ్పీటీసీ తన స్వంతంగా మండలంలోని గ్రామాలు, గిరిజన తండాలలో 55 మంచినీటి బోర్లు,30 పైగా గ్రామాలకు ఎల్ఈడీ లైట్లు,4 వేల మంది ఆపద, సంపదలో పేదింటి కుటుంబాలకు ఆర్థిక సహాయం, నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలు, జాతరలు, పాఠశాలలో విద్యార్థులకు సహకారం అందించే గుణం మహేష్ గుప్తదే అన్నారు. శివ్వంపేట ప్రధాన రహదారిపై డివైడర్, బట్టర్ ప్లై లైట్లు, ఆధునిక అద్దాల బస్టాండ్, గ్రామంలో 8 మంచినీటి బోర్లు వేసి గ్రామ ప్రజల సమస్యలు తీర్చిన నాయకుడు మహేష్ గుప్త అని అన్నారు.చిల్డ్రన్ పార్క్, వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మార్కెట్ యార్డ్, గ్రామంలో 90 శాతం సీసీ రోడ్లు మాజీ జడ్పీటీసీ హయాంలో వేసినవేనని ఆయన తెలిపారు. తన తాత దివంగత పబ్బ అంజయ్య హయాంలో నుండే గుడులు, గోపురాలు కట్టినట్లుగానే మాజీ జడ్పీటీసీ హయాంలో నూతనంగా కట్ట మైసమ్మ దేవాలయం, బగలాముఖీ అమ్మవారి శక్తిపీఠం నిర్మాణం కావడంతో శివ్వంపేట గ్రామం పేరు చరిత్రపుటల్లోకి చేరిందని ఆయన గుర్తు చేశారు. కరోనా సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతి ఇల్లిళ్లు తిరిగి మహేష్ గుప్త కరోనా టెస్టులు చేపిస్తే, కరోనాలో కాంగ్రెస్ నాయకుల ముఖాలే కనిపించలేదని ఆయన మండిపడ్డారు.కెసిఆర్ హయాంలో కట్టిన పాఠశాలకే రంగులేయించి అదేదో అందంగా చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ లో పైరవిలు చేసి పిఫ్టీ, పిప్టీ తీసుకునే అలవాటు మాజీ జడ్పీటీసీ లేదని ఆయన కీతాబునిచ్చారు. గుండా స్వామి పెద్ద భూస్వామి కాదని, కాయకష్టం చేసుకునేటోని దగ్గర డబ్బులు తీసుకునే చిల్లర గుణం పబ్బ మహేష్ గుప్తది కాదని, పది మందికి తన స్వంతంగా ఆదుకోవడమే తప్ప దోచుకోవడం ఆయనకు తెల్వదని, పెద్దోళ్లను విమర్శిస్తే పెద్దోళ్ళు కారని,అధికారం ఉంది కదని ఏది మాట్లాడితే అది నడుస్తదనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకుడు నవీన్ గుప్తా కార్యకర్తలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ ముదిరాజ్ గ్రామకమిటీ అధ్యక్షులు లక్ష్మీనర్సయ్య, కొండల్,బాసంపల్లి రామగౌడ్,పైనం గా యాదగిరి, పోచగౌడ్,లక్ష్మీనారాయణ, సుదర్శన్ గౌడ్, పంబళ్ల సంతోష్,గుండ స్వామి, ముద్దగల్ల రాజు, హరీష్ అజయ్. రుస్తుంపేట నవీన్ సాయి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
