బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి మహాపూజలు!..

బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి మహాపూజలు!..


శివ్వంపేట ఏప్రిల్ 15 (క్విక్ టు డే న్యూస్):- దేశంలోనే ఎక్కడ లేని విదంగా ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో దాతల సహకారంతో బగలాముఖీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమై, ప్రతి నిత్యం భక్తులకు దర్శనమిస్తున్న శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో బగలాముఖీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం ఉదయం అమ్మవారికి మహాపూజలు నిర్వహించడం జరిగినది. అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మర్శి శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు, పీతవర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారికి రుద్రయామల బగలా అష్టోత్తర నామర్చనలతో హరిద్రార్చన కార్యక్రమం నిర్వహించి, అమ్మవారికి అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి, నానా విధఫలాలతో నైవేద్యం సమర్పించడం జరిగినది. తనను నమ్మిన భక్తుల ప్రతిభందకాలను తొలగించే బగలాముఖీ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి భక్తులకు కొడకంచి సుదర్శన్ గౌడ్ పులిహోర ప్రసాదం అందజేయడం జరిగినది.

IMG-20250415-WA0022

Read Also అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?