అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలి

అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలి


మిర్యాలగూడ, ఏప్రిల్ 25 (క్విక్ టుడే న్యూస్):- జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో పర్యాటకులపై అమానుషంగా కాల్పులు జరిపి 26 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. పహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై కాలుపులు జరపడం అమానుష చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. పహాల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప, , పలువురు కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

Read Also శ్రీ రాగా స్కూల్ వార్షిక పరీక్షల ఫలితాల సందడి.. ముఖ్యఅతిథిగా హాజ‌రైన‌ మల్లవరపు వరప్రసాద్, కవిత

IMG-20250425-WA0068

Read Also నాణ్యతను పాటించని హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?