Collector Gautham: పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పనిచేయాలి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం
గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వే లెన్స్, వీడియో, వీవింగ్ సర్వే లెన్స్, ఎం సి సి బృందాలతో డి సి ఓ రాజేందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కేశు రామ్, డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ తిరుమలేష్, ఈ డిస్టిక్ మేనేజర్ భాను ప్రకాష్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు.
అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు, ఫ్లయింగ్ స్క్వాడ్ సర్వే లెన్స్, టీంల బాధ్యతలను తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందని సూచించారు. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు 24/7 పర్యవేక్షణలో ఉంటారని, అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా, ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం లాంటి వాటిని పకడ్బందీగా నియంత్రించాలని ఆదేశించారు.
ఎన్నికలలో అభ్యర్థుల ఖర్చుల తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ఏవైనా అనుమానాలు ఇబ్బందులు తెలియని విషయాలు ఉంటే సంబంధిత ఉన్నత అధికారులను అడిగి తెలుసుకోవాల్సిందిగా తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యాత్మక ప్రదేశాలలో ప్రత్యేకమైన ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు సకాలంలో చేరుకోలేని పక్షంలో కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
జిల్లాలో స్టాటిస్టిక్ సర్వేలెన్సులు చురుగ్గా పనిచేయాలని ఎక్కడైనా 50వేల రూపాయల కంటే అధికంగా నగదు రవాణా చేస్తున్నట్టు గుర్తిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా సందేహాస్పదంగా ఉంటే దానిని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేయాలి అని అన్నారు. సీజ్ చేసిన నగదు వివరాలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి చూపించి తమ నగదును విడుదల చేసుకోవచ్చు అని తెలిపారు.
10 లక్షల రూపాయల వరకు ఆధారాలు లేకపోతె ఇన్ కమ్ టాక్స్ వారికి సమాచారం అందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ప్రతిరోజు నివేదికలు పంపే విధంగా ఎం సి సి నోడల్ అధికారి, అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత ఖర్చులకు సంబంధించిన వివరాలు రిపోర్టులను ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి, రాజకీయ ప్రకటనలకు సంబంధించిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారులు గమనించాలన్నారు.
సి విజిల్ యాప్ ఈ ఎస్ఎంఎస్ యాప్ లను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే సి విజిల్ యాప్, ESMS యాప్ ల ద్వారా ఫిర్యాదు చేసే విధంగా ఎన్నికల కమిషన్ యాప్ రూపొందించిందని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, అందుకు సరియైన ఆధారాలు సేకరించాలన్నారు.
సీజ్ చేసిన డబ్బులు వస్తువులను ESMS యాప్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి అన్నారు. సీజ్ చేసే సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాలలో కంప్లైంట్ ను చేదించి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది అని అన్నారు. ఎన్నికలలో అక్రమాల నివారణకు ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, టీంలు కృషి చేయాలని తెలిపారు.
ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి వి టి, ఎం సి సి టీంలకు వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల సమయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనిచేయాలన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ 24/7 నిర్వహించాలని ఫిర్యాదులు సమస్యలు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కోడ్ అమలులోకి రాగానే నిర్వహించే విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి విధులు ఏర్పాట్లు తదితర విషయాలపై జిల్లా ట్రైనర్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.