Rains alert: తెలంగాణలో దంచికొడుతున్న వాన‌లు.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్..

Rains alert:  తెలంగాణలో దంచికొడుతున్న వాన‌లు.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్..

 Rains alert:  ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎడతెరిపిలేని  వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవ‌డంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితులలో రోడ్లపైకి రాలేక నానా తిప్పలు పడుతున్నారు. ప‌లు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల  వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. ప‌లుచోట్ల రోడ్ల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. పంట‌చేలు నీట‌మునిగాయి. ప‌లుచోట్ల వ‌ర‌ద‌ల్లో వాహ‌నాలు కొట్టుకుపోయాయి. ప‌లువురు గ‌ల్లంత‌య్యారు. రోడ్ల‌పై నీరు నిలిచిపోవ‌డం, తెగిపోవ‌డంతో ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల‌కు పాత ఇండ్లు కూలిపోతున్నాయి. 

Read Also టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌లోని మొగ‌ల్రాజ‌పురుంలో కొండచ‌రియ‌లు ఓ ఇంటిపై కూల‌డంతో న‌లుగురు మృతి చెందారు. తెలంగాణ‌లోనూ భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌లువురు మృతి చెందారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇళ్ల‌ల్లోకి నీరు చేర‌డంతో సామ‌గ్రి నీటిలో త‌డిసిముద్ద‌య్యాయి. 

Read Also పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క

స‌కాలంలో స్పందిస్తున్న రెస్క్యూ టీమ్‌

01 -12

Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

అధికారులు, రెస్క్యూ టీమ్ స‌రియైన స‌మ‌యంలో స్పందించి బాధితుల‌ను ర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. నీట మునిగిన సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి వారికి ఆహార పొట్లాల‌ను అందిస్తున్నారు. ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. తెలంగాణ‌లో మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతో పాఠ‌శాల‌ల‌కు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది.

Read Also ఆర్థిక సాయం అందజేత

దాదాపుగా అన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాతావరణ హెచ్చరిక ప్రకారం  సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని  హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే హైదరాబాదు మరియు విజయవాడ రోడ్లు మార్గంలో వర్షాలు వల్ల భారీ స్థాయిలో నీరు నిల్వ ఉంటుందని ప్రజలు ఎవరు బయట ఎక్కువగా తిరగవద్దు అని  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే మార్గాలను మూసివేసి  మిర్యాలగూడ మరియు గుంటూరు రోడ్ల వైపుగా వాహనాలను మళ్లిస్తున్నారు. 

Read Also విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

ప‌లు  జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌

 తీవ్రమైన వాయుగుండం కారణంగా  అదిలాబాద్,నిర్మల్, నిజామాబాద్,కామారెడ్డి, మహబూబ్నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ,గద్వాల్  జిల్లాలలో  20 సెంటీమీటర్ల కు పైగా వర్షపాతం నమోదు అవుతున్న కారణంగా  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్  ఆదేశాలను జారీ చేశారు. మరో 12 జిల్లాల్లోనూ  భారీ నుండి అథి భారీ వర్షాలు కురుస్తాయని కాబట్టి ప్రజలు రోడ్లపై తిరగవద్దు అని  వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. 

హైద‌రాబాద్‌లోనూ ఎడ‌తెర‌పిలేని వాన‌లు..

01 -13

 హైదరాబాదులోనూ శనివారం మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసాయి. దీంతో శనివారం మొదలుకొని ఇవాల్టి దాకా  ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు  తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని  జిహెచ్ఎంసి హెచ్చరించింది. అలాగే ఇవాళ మరియు రేపు  భారీ నుండి అది భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందుగానే  జిల్లాలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. 

 అలాగే మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అలాగే మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు చాలా అప్రమత్తంగా ఉండాలని  ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు మూడు రోజులు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని  బయటకి ఎక్కడికి వెళ్లొద్దని  వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి.

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

 మరోపక్క ఎవరు వాగులు, వంకలు ప్రక్కన తిరగవద్దు అని  లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ  ప్రజలను కాపాడాలంటూ కొంతమంది అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎవరు కూడా బయట తిరగవద్దు అని  ఏదైనా అత్యవసర అవసరమైతే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం  మరో రెండు మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని  ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని  కోరారు. 

01 -14

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించి త‌క్ష‌ణ సహాయ‌క చ‌ర్య‌ల‌పై ఆరా తీశారు. అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆమె ఆదేశించారు. ఆదివారం సెల‌వు రోజుల్లోనూ అధికారులు విధుల్లో పాల్గొనాల‌ని సూచించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా త‌మ వంతు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటూ త‌మ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

అలాగే విద్యుత్ స్తంభాల కింద, చెట్ల కింద ఉండరాదని ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాటి వల్ల ప్రమాదం కలుగవచ్చని  కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్య‌వ‌స‌రం ఉంటే త‌ప్ప ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని స్ప‌ష్టం  చేసింది. ప‌లు చోట్ల విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డింది. ప్ర‌జ‌లు చీక‌ట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్ల‌దీస్తున్నారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?