విద్యార్థుల అభివృద్ధి కోసం.. ఉపాధ్యాయులు నిరంత‌రం కృషి

విద్యార్థుల అభివృద్ధి కోసం.. ఉపాధ్యాయులు నిరంత‌రం కృషి

సిద్దిపేట‌, మే 16 (క్విక్ టుడే న్యూస్‌):-ప్రతి ఉపాధ్యాయుడు తన సమస్యల పట్ల పోరాటం చేస్తూనే బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలనేటువంటి తపన, విద్యార్థుల నిరంతర అభివృద్ధి కోసం వారు చేసే కృషి అభినందనీయమని అన్నారు. విద్యాభివృద్ధి తో పాటు సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులు బహుముఖ పాత్ర పోషిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. సిద్దిపేట జిల్లాలో వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలను డిఈవో శ్రీనివాస్ రెడ్డి తపస్ జిల్లా అధ్యక్షులు ఊడెం రఘువర్ధన్ రెడ్డి తో పాటు సందర్శించిన ఆయన తన గెలుపుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరాలలో విద్యాభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు తనవంతు పాత్రను పోషించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందివాలని, పిల్లల నమోదు పెంచాలని ప్రయత్నం చేస్తుందని, దానికి ప్రతి ఉపాధ్యాయుడు తన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంక్షేమం కోసం వారి సమస్యలు పక్కనపెట్టి కృషి చేస్తున్నారని కొనియాడారు. తనను గెలిపించిన ఉపాధ్యాయులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏకీకృత సర్వీసు నిబంధనల సాధనకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నానని, అందుకుగాను కేంద్ర అధికారులను కూడా కలవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం విద్యాధికారులకు కలుస్తూ వారికి ప్రాతినిధ్యం చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బదిలీలు పదోన్నతులకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. IMG-20250516-WA0028  ఉద్యోగ ఉపాధ్యాయులు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారి కుటుంబం డబ్బులు లేక తీవ్ర మానసిక వేదనకు గురవుతుందని దానికి గాను ప్రభుత్వం వెంటనే నగదు రహిత చికిత్స విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఉపాధ్యాయులకు వారి డబ్బులు వారు తీసుకోలేకపోతున్నారని దానివల్ల ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నింటినీ చెల్లించాలని, రిటైర్ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు సంతోషంగా గడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని ప్రతి ఉపాధ్యాయులు కూడా దీనికి సహకరించాలని కోరారు. విద్యా వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలల పాత్ర కీలకమైందని నాణ్యమైన విద్యను అందించాలంటే ప్రాథమిక పాఠశాలలే పట్టుకోమ్మలని అన్నారు. అలాంటి పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడైన నియమించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలను సమకూర్చినప్పుడే వారి నుంచి నాణ్యమైన విద్యను ఆశించగలుగుతామని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలపై పోరాటం చేస్తూనే, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని, వారి బహుముఖ పాత్ర అభినందనీయమని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని దానికోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన డిఎలు అన్నిటిని విడుదల చేయాలని, తక్షణం పిఆర్సి అమలు పరచాలని కోరారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు జీరో వన్ జీరో కింద జీతాలు చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు తమ సమస్యలను ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పదోన్నతులకై పోరాటం చేయాలని ఉపాధ్యాయులు కోరారు. వారితో పాటు తపస్సు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల వివిధ సమస్యలపై విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు తిరుపతి, శ్రీనాకర్ రెడ్డి, సింగోజి జనార్ధన్, నర్సిరెడ్డి జిల్లా బాధ్యులు బాలకిషన్, ఉమాశంకర్, మీసం వెంకన్న తదితరులు ఉన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?