పరమేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదువుల తల్లికి చిరు సత్కారం

పరమేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదువుల తల్లికి చిరు సత్కారం

 వేములపల్లి, మే 05 (క్విక్ టుడే న్యూస్):- వేములపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు పుట్టల పరమేష్ వర్ధంతి సందర్భంగ, పరమేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిరియం అనాధ ఆశ్రమ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమానికి సంబంధించిన విద్యార్థిని కేజీబీవీ మాడుగులపల్లి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పుట్టల ప్రసన్న, తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోయింది. 600 గాను 564 మార్కులు సాధించి పాఠశాల ప్రధమ స్థానంలో సాధించినందుకు గాను, పరమేశ్వర ఫౌండేషన్ చైర్మన్ పుట్టల వెంకన్న (కొమ్ము) శాలువాతో సత్కరించి తన చిరు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పేద విద్యార్థులు ఎక్కడ ఉన్న తన ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని, ఏ విధమైన సహాయ సహకారాలు కావాలి అన్న తమకు తెలియపరిస్తే వెంటనే స్పందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరారపు తిరుమలేష్, పాల్వాయి సుందర్, పందిరి రవి, పుట్టల మైసయ్య, పుట్టల దినేష్, పుట్టల వెంకన్న, నూకపంగ రమేష్, పుట్టల సైదులు, కోట సుందర్, దైద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

IMG-20250506-WA0004IMG-20250506-WA0005

Read Also తోటి  స్నేహితుడు సోమేశ్ కి  21 వేల ఆర్థిక సాయం

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?