శివ్వంపేట మే 16 (క్విక్ టు డే న్యూస్):-శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో టెంకాయలు,పూజ సామాగ్రి వేలం పాట నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ, కార్యనిర్వకధికారి సార శ్రీనివాస్ తెలిపారు, శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామ శివారులో గల చకరిమెట్ల అభయారణ్యంలో స్వయంభుగావె

లిసిన శ్రీ సహకారం ఆంజనేయస్వామి దేవస్థానం లో ప్రతి ఏటా నిర్వహించే వేలం పాటను 2025-2026 సంవత్సరానికి గాను ఈనెల 20వ తారీకు,ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు, వేలం పాటలో పాల్గొనాలి అనుకున్నవారు,ఒక పాస్ ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,రెండు బ్యాంక్ చెక్కులు, వంద రూపాయల బాండ్ పేపర్, లతోపాటు శ్రీ సహకారాంజనేయ స్వామి దేవస్థానం పై లక్ష రూపాయల డిపాజిట్ డిడి,లేదా నగదు రూపంలో తీసుకొని వేలంపాటకు గంట ముందు దేవస్థానం వద్దకు రావాల్సిందిగా దేవాదాయ ధర్మదాయ శాఖ, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ,కార్యనిర్వాహక అధికారి సారా శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు.