నేడు పల్లె సుద్దుల సృష్టికర్త, జానపద బ్రహ్మ పొలిశెట్టి లింగన్న 13వ వర్థంతి

నేడు పల్లె సుద్దుల సృష్టికర్త, జానపద బ్రహ్మ పొలిశెట్టి లింగన్న 13వ వర్థంతి

వేములపల్లి, మే 14 (క్విక్ టుడే న్యూస్):- పల్లె సుద్దుల సృష్టికర్త, జానపద బ్రహ్మ, నిత్య నూతన కవి, సినీ రచయిత, గాయకుడు పొలిశెట్టి లింగన్న 13వ వర్థంతి 15-05-2025 గురువారం నాడు తెలంగాణ కళా వేదిక రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలిశెట్టి లింగన్నను యాదిచేసుకుంటూ కళకు వెల లేదు, కళాకారునికి మరణం లేదు, పోలిశెట్టి లింగన్న 2012 మే 15వ తారీఖు నాడు అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. IMG-20250514-WA00442025 మే 15 నాడు పొలిశెట్టి లింగన్న 13వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా, వేములపల్లి మండలం, సల్కునూరు గ్రామంలోని పొలిశెట్టి నారాయణ-లింగమ్మ దంపతులకు 1970లో పొలిశెట్టి లింగన్న జన్మించారు. పేదరికం కారణంగా 8వ తరగతి వరకు చదివి మధ్యలోనే చదువు నిలిపి వేసిన  లింగన్న, చిన్నతనంలోనే తన తల్లి లింగమ్మ తో కలసి వరి కోతలకు, నాట్లకు, కల్పులకు వెళుతూ అక్కడ ఆడవారు పాడే పాటలలో ఉన్నటువంటి మెళకువలను గ్రహించి, పాట పాడటం, పాట రాయడం పట్ల ఇష్టం పెంచుకున్నాడు, పేదరికంలో పుట్టడం వలన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలపై అవగాహన పెంచుకున్నాడు, పాటను ఆయుధంగా మలుచుకుని మొదటగా ప్రజానాట్యమండలిలో చేరి ప్రజా పాటలు ఆలకిస్తూ పల్లెసుద్దులు సృష్టించి "పల్లె సుద్దుల సృష్టికర్త" గా పేరు తెచ్చుకున్నాడు, ప్రజానాట్యమండలిలో కొనసాగుతూ "ప్రజల పాటలు" అనే పేరుతో పుస్తకాన్ని ముద్రించారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత "రాజీవ్ కి జోహార్లు" పేరుతో పాటలు రాసి ఆ పాటల క్యాసెట్ ను భారతదేశ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేశారు. ఈ పాటలతో పొలిశెట్టి లింగన్నకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంకా అనేకమైనటువంటి పాటలు అందులో ముఖ్యంగా మరదలు పిల్లా, బాలమ్మ బాగున్నావా, బావ నీకు యాదున్నాడ అంటూ బావా మరదళ్ల మధ్య ఆటపట్టించే పాటలు, అదే విధంగా లవ్ ర్యాప్, గజ్జల గంగూలీ, కోట మైసమ్మ, దండు మైసమ్మ, జానపద గేయాలు, క్యాసెట్ రూపంలో ప్రజలకు చేరువ చేశారు అని అన్నారు. ఈ క్రమంలో వరంగల్ శంకరన్న,సారంగపాణి, అన్న చేత అనేక పాటలు పాడించారు. సారా ఉద్యమంలో మరో దండోర అనే పేరుతో సారాయికి వ్యతిరేకంగా పాటలు రూపొందించారు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ శ్రద్ధాంజలి పేరుతో పాటలను రూపొందించి, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారుల చేత అనేకమైనటువంటి సన్మానాలు,  మన్ననలు పొందారు. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ వీరతెలంగాణ, పోరు తెలంగాణ, వచ్చేర తెలంగాణ, పాటలను రూపొందించి, తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా ప్రాణం పోశారు. స్వర్ణక్క సినిమాలో ఆ నవ్వులే మాయనే స్వర్ణక్క, ఆల్ రౌండర్ సినిమాలో అత్తరు సాయిబు మంచొడమ్మ, పిట్టల దొర సినిమాలో గింత కూరుంటెయ్యమ్మో, 20వ శతాబ్దం సినిమాలో అమ్మను మించి దైవమున్నదా, శ్రీ దేవి నర్సింగ్ హోం సినిమాలో ఆనా బేడా చారాణా ఆఠాణా పాటలు రచించి చలనచిత్ర రంగంలో రచయితగా రాణించాడు. అదే విధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మీద జోహార్ ఎన్టీఆర్ అనే పాటని రూపొందించి, అనేకమైనటువంటి ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు పొందారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మీద పాటలు రచించి క్యాసెట్ ను రూపొందించటం జరిగింది. పొలిశెట్టి లింగన్న రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కళాకారులను ప్రోత్సహించటం జరిగింది. తెలంగాణ మలిదశ పోరాటంలో పొలిశెట్టి శిష్యులు కాలికి గజ్జలు, భుజాన గొంగడి, సంకన డప్పు వేసుకుని, సాంస్కృతిక ఉద్యమాల ద్వారా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం పై సాగుతున్న మహోత్తర పోరాటంలో, కదం కలుపుతూ గొంతెత్తి పోరాట స్వరాల్ని పలికిస్తూ ప్రముఖ పాత్ర పోషించారు. ఎన్నో తెలంగాణ సభలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను మేల్కొలిపి, పోరాటాల వైపు కదిలించే దిశగా వందలాది మంది ప్రజా కళాకారులతో మమేకమై, పల్లె పల్లెనా అనేక ఆట పాట, ధూంధాంలు వేలాది మంది ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రదర్శనల ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవగాహన అందిస్తూ, ఆవశ్యకతను వివరిస్తూ, నిత్యం కొనసాగుతున్న తెలంగాణ పోరాట మలుపులోనూ వెన్నుతట్టి, గొంతు కలుపుతూ పొలిశెట్టి లింగన్న శిష్యులు తమ వంతు కర్తవ్యంగా, తమకున్న పరిధిలో తమ శక్తి మేరకు, తెలంగాణ ఉద్యమానికి ఊతంగా ప్రజల పక్షాన ప్రజా కళాకారులుగా, ప్రజా కళలు కళారూపాలను పదును పెడుతూ తెలంగాణ పోరాట సంస్కృతిని ఎత్తి పడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమ సమయంలో 2012 మే 15వ తారీఖున పొలిశెట్టి లింగన్న మరణం వార్త అందరినీ కలచివేసింది. పొలిశెట్టి లింగన్న 13వ వర్థంతి  సందర్భంగా  ఆయన జ్ఞాపకాలను మీ ముందు ఉంచుతూ కన్నీటి పర్వమైన కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటే కిరణ్ కుమార్

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?