About Ramzan: రంజాన్ గురించి వీళ్లు చెప్పిన మాటలు వింటే...కన్నీరు పెట్టకుండా ఉండలేరు...
About Ramzan: ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో ప్రత్యేకమైనది.నెల రోజుల ఉపవాసం తర్వాత జరుపుకునే ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రపంచంలో ముస్లింల అందరికీ ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలోనే ఎంతోమంది ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాసాలు చేస్తారు. మరి ఈ మాసంలోనే ఉపవాసాలు ఎందుకు ఉంటారు. ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం కు అత్యంత ప్రీతికరమైన మాసం రంజాన్ మాసం. ఇది మానవాళి మనుగడకు దిశా, నిర్దేశం చేసిన ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్. ఇది భూమిపై ఆవిర్భవించిన రోజే రంజాన్ నెలగా పిలుస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన ముస్లిం మత పెద్దలు ఇలాహి బక్ష్ దీని గురించి తెలిపారు.రంజాన్ నెల సందర్భంగా ముస్లిం పవిత్ర పూజలు చేసె సమయంలో వాటి విశిష్టత లోకల్ 18 కు తెలిపారు.మరిన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం..
ముస్లిం ల సంవత్సరాలు మొహరంతో స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన సంవత్సరంలో 9వ నెల రంజాన్ గా పిలుస్తారు.ఈ నెలలో అల్లాహ్ పవిత్ర గ్రంథం అయిన దివ్య ఖురాన్ ను భూమి పై వచ్చిన నెల, రంజాన్ నెల ఈ దివ్య ఖురాన్ లో 30 అధ్యాయాలను రోజుకు ఒక అధ్యాయనం గా పరిగణించి భూమి మీదకి పంపించారు. అందుకే రంజాన్ నెలలో 30 రోజులను పవిత్ర రోజులుగా భావిస్తారు.
ముస్లిమ్స్ అంత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నిజానికి దివ్య కురాన్ లో మానవుడు ఎలా బతకాలి, ఎలా బతకవద్దు అనే విషయాలను గురించి అల్లా స్పష్టంగా చెప్పింది.ప్రతి ఒక్క ముస్లిం ఐదు పూటల నమాజ్ చేయడంతో పాటు కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి.హజ్ యాత్ర పూర్తి చేయాలి.ఉపవాసానికి సంబంధించిన ప్రార్థనలు చేయాలి.జకాత్ లను చెల్లించాలి. వీటన్నిటిని పాటిస్తేనే మానవుడు అల్లా అనుగ్రహం పొందుతాడు అనేది వాళ్ళ నమ్మకం.
అందువల్ల ప్రతిరోజు ఈ నియమాలు పాటించడానికి వీలుగా ప్రతి రంజాన్ నెలలో వీటిని అలవాటు చేసుకునేందుకు ముస్లిం ఖచ్చితంగా నియమలు పాటిస్తారు.. రంజాన్ మాసంలో ఐదు పూటల నమాజ్ చేయడంతో పాటు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు సుమారుగా 12,13 గంటల వరకు కటోర ఉపవాసం చేయాలి.
నిజానికి ఏదో ఒక రూపంలో ఉపవాసం చేయటం దాదాపు దేశం మొత్తంలో అన్ని మతలవారు ఉపవాసాలు చేస్తారు.సూర్యుడు ఉదయించిన దగ్గర్నుంచి అస్తమించే వరకు ముస్లింలు చేసే ఉపవాసాన్ని 'రోజా 'అని పిలుస్తారు. రంజాన్ మాసంలో ముస్లింలు చేసే రోజా వెనక ఒక పరమార్థం ఉంది అని తెలిపారు. అయితే ఆకలి, దప్పికలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అయితే ముందు వాళ్లు ఆకలి,దప్పికల బాధ మానవులు అనుభవించాలి.
అప్పుడే నిజంగా కష్టాల్లో ఉన్నవారి బాధలు వాళ్లకు అర్థమవుతాయి.దీనినే లక్ష్యంగా తీసుకొని పేద,ధనిక అనే తేడా లేకుండా రంజాన్ నెలలో దేశవ్యాప్తంగా ముస్లిం అంత దీనిని రోజా అంటారు. అంతేకాక భూమిపై చేసే పాప పుణ్యాల ద్వారా అల్లా అనుగ్రహం కలుగుతుంది. సత్ ప్రవర్తనతో జీవించటమే ఖురాన్ మానవ జాతికి ఇచ్చిన ఒక సందేహం అని మత పెద్దలు ఇలాహి బక్ష్ తెలిపారు..