విలేకరిని బెదిరించిన మాజీ కార్పొరేటర్ దానగళ్ల యాదగిరి.. మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసిన మేడిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు
On
విధి నిర్వహణలో ఉన్న విలేకరిని ఫోన్ లో బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్ దానగాళ్ల యాదగిరి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ క్లబ్ అధ్వర్యంలో బాధిత జర్నలిస్టుతో కలిసి మేడిపల్లి సీఐ అర్.గోవింద్ రెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత జర్నలిస్టు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న అంశంపై తాను ఫోటోలు తీస్తుండాగ భూ కబ్జా దారుడైన కాంగ్రెస్ నేత దానగళ్ల యాదగిరి అనే బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నేత ఫోన్ లో ఇష్టానుసారంగా దుర్భాషలాడాడని వాపోయాడు. అతను ఫోన్ లో మాట్లాడిన బూతుల ఆడియో రికార్డు లను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా మేడిపల్లి మండల ప్రింట్ మీడియా అధ్యక్ష,కార్యదర్శులు కల్కూరి ఎల్లయ్య, చిర్ర శ్రీధర్ రెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టులను బూతులు తిట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...