MLC Kavitha : తిహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఆమె రిమాండ్ కాలంలో కవిత వాంగ్మూలాన్ని రికార్డ్ చేశామని, ఆమె విచారణలోపలువురు వ్యక్తులు, డిజిటల్ రికార్డులతో విచారించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. కేసు పురోగతిలో ఉన్నందున మరో 15 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ అవసరం అని తెలిపారు. అయితే ఆమె కుమారుడికి పరీక్షలు జరుగుతున్నాయని బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్డు దృష్టికి తీసుకొచ్యారు.
ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 9వ తేదీవరకు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందంటూ పేర్కొంది. ప్రస్తుతం ఆమెను అధికారులు తిహార్ జైలుకు తరలించనున్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది.
ఈనెల 15న కవితను అరెస్టు చేసి మరుసటి రోజు వీడి కష్టానికి తీసుకుంది మళ్లీ బుధవారం హైదరాబాదులోని కవిత నివాసంలో అదే రోజు హైదరాబాదు కవిత నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేసినట్లు టిడిపి ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కవిత వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే...
మెయిల్ పిటిషన్ రాల్కోటను ఆశ్రయించాలని గతంలోనే సుప్రీంకోర్టు తెలిపింది జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ నరేష్ జస్టిస్ వేలం ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అందరికీ ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తారని రాజకీయ వ్యక్తులు ఎక్కువ ఏం కాదని బెయిల్ కోసం నేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అనుమతించలేము అని గతంలో కోరి
ఎమ్మెల్సీ కవితను కోర్టు ముందు హాజరుపర్చేందుకు ఈడీ అధికారులు తీసుకెళ్తున్న సమయంలో ఆమె మీడియాతో పలు విషయాలు మాట్లాడారు. తనపై మోపినది మనీలాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపించారు. నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చు అని, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయవచ్చుగాని.. నేను కడిగిన ముత్యంలా బయటకి వస్తానని అన్నారు.
తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని, మరో నిందితుడికి లోక్‌సభ టికెట్ ఇస్తున్నారని, మరో నిందితుడు బాండ్ల రూపంలో రూ.50 కోట్లు బీజేపీకి ఇచ్చినట్లు కవిత ఆరోపించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ ఆమె కోర్టులోకి వెళ్లారు.
బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను మార్చి 15న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆమెను మరుసటి రోజే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఈడీ 7 రోజుల కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే..