పాలకుర్తి నియోజకవర్గంలో కారు బేజారు కాంగ్రెస్ హుషారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.... మా అత్త కోడళ్ళ ను తక్కువ అంచనా వేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి ఇంకా.... ఏదో ఆశతో ఉన్నారని, వారు ఆశలు వదులుకుంటే వారికే మంచిదని చెప్పారు. ఈ చేరికలు ఇంకా... కొనసాగుతాయని, ఇంకా చాలా మంది నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు.
*బిఆర్ఎస్ పనితీరు నచ్చకపోవడముతో కాంగ్రెస్ లో చేరాను..*
డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
పాలకుర్తి నియోజకవర్గం లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘోర పరాజయం పాలైనప్పటికీ. పాలకుర్తి నియోజకవర్గం నాయకుడు ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా, కనీసం బిఆర్ ఎస్ పార్టీ సంస్థ గత నిర్మాణం చేపట్టకుండా, గ్రామాల, మండలాల్లోని కార్యకర్తలను నిరుత్సాహపరిచే రీతిలో వ్యవహరించడంతో విసుగు చెందాను. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సేవా దృక్పథంతో అమెరికా నుంచి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పాలకుర్తి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయించుకున్నాను. వారి సారథ్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని భావించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాతో పాటుగా పార్టీలో చేరిన మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరికీ పార్టీలో సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి నుండి తరలి వచ్చిన నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.