MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ

MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ

MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ పిటిషన్ పై జాప్యం లేకుండా వెంటనే విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం కోర్టు దేశాలు జారీ చేసింది. పిటిషన్ లో లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. 

ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లో రాజ్యాంగ బద్ధతకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. అరెస్ట్ చేయడం, సోదా చేయడం, వస్తువులను సీజ్ చేయడం, ఆస్తులను అటాచ్ చేయడం లాంటి కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కవిత లేవనెత్తారు. వాటిని సవాల్ చేస్తూ తన అరెస్ట్ చట్టబద్ధం కాదు,

Read Also ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి యశస్విని ఝాన్సీ రెడ్డిలు

రాజ్యాంగ బద్ధం కాదు, తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ఆ పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే బెయిల్ అంశం ప్రొసీజర్ ప్రకారం ముందు ట్రయల్ కోర్టు నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుందని.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరణకు గురయితే హైకోర్టుకు వెళ్లాలని.. ఒకవేళ హైకోర్టులో కూడా బెయిల్ ఇవ్వకపోతే మాత్రమే సుప్రీంకోర్టుకు రావాల్సి ఉంటుంది కానీ.. నేరుగా సుప్రీంకోర్టుకు రావద్దు అని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. 

Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

226 -2

Read Also వ‌ర్షాకాలంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..అధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

MLC Kavitha : ట్రయల్ కోర్టులో అయినా కవితకు బెయిల్ వచ్చేనా?

Read Also దేశం లో గర్వింగా భావించే ఇందిరా సౌర గిరిజన వికాస పథకం

పిటిషన్ లో లేవనెత్తిన రాజ్యాంగ పరమైన అంశాలను పరిశీలిస్తే.. ఇదే తరహా అభిప్రాయాలతో గతంలోనూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. విజయ్ మదన్ లాల్ కేసు దీనికి ఉదాహరణకు చెప్పొచ్చు. అది చాలా కాలంగా విచారణ జరుగుతూనే ఉంది. ఆ కేసుకు, ఇప్పుడు కవిత కేసును టాగ్ చేసి ఆరు వారాల పాటు సమయం ఇచ్చారు.

Read Also ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి

ఆరు వారాల్లోకా ప్రతివాదులుగా ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ అధికారులు సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పిటిషన్ ను విజయ్ మదన్ లాల్ కేసుతో టాగ్ చేసి ఒకేసారి విచారణ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మాత్రం దొరకలేదు. బెయిల్ కోసం ప్రయత్నాలు మీరు ట్రయల్ కోర్టులోనే చేసుకోవాలని సుప్రీం తెలిపింది. 

ప్రముఖ సుప్రీం న్యాయవాది కపిల్ సిబల్ ట్రయల్ కోర్టులో జాప్యం జరుగుతుంది అని సుప్రీంలో ప్రస్తావించగా.. బెయిల్ పిటిషన్ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వీలైనంత వేగంగా విచారణ జరిపి.. బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది వెంటనే తేల్చాలని ట్రయల్ కోర్టును సుప్రీం ఆదేశించింది. 

226 -3

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కింద ఇప్పటికే ఈడీ పలువురిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోనే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.  అయితే.. లోక్ సభ ఎన్నికలకు సరిగ్గా నెల రెండు నెలల సమయం ముందే ఇలాంటి అరెస్టులు జరగడంపై దేశ రాజకీయాల్లో అలజడి మొదలైంది.

నిజానికి.. కవిత అరెస్ట్ కంటే ముందే ఈ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్, ఇండో స్పిరిట్ సంస్థ ఓనర్ సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేశ్ జోషి, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లైలను గత సంవత్సరమే ఈడీ అరెస్ట్ చేసింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?