సార్వత్రిక సమ్మె నోటీస్ అందజేత

సార్వత్రిక సమ్మె నోటీస్ అందజేత


తొర్రూర్ మే 07(క్విక్ టుడే న్యూస్):- కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కేంద్ర కార్మిక సంఘాలు మే 20న జరుప తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా( టి యు సి ఐ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి* అన్నారు. నేడు తొర్రూర్ లోని ఐరన్ హార్డ్వేర్ షాపుల యజమానులకు కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ ను అనుమాన్ల మోహన్ రెడ్డి గారికి అందజేశారు.  అనంతరం తొర్రూర్ మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్ కు ఈనెల 20న జరుప తలపెట్టిన సార్వత్రిక సమ్మె నోటీస్ నేడు మున్సిపల్ కార్యాలయంలో* అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాదిమంది కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని అనేక నివేదికలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. 45 కోట్ల మంది కార్మిక వర్గం హక్కులను హరిస్తూ కార్పొరేట్ బౌల జాతి కంపెనీల లాభాల కోసం నూతన లేబర్ కోల్డ్ తీసుకొచ్చి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాల రాస్తున్న మోడీ సర్కార్ పై కార్మిక వర్గం గ్రామీణ ప్రాంత రైతాంగం ఐక్యంగా సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. ఉపాధి, సామాజిక భద్రత ప్రతి కార్మికుడి హక్కు అని దానిని కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం సంగటితమై ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయటమే మే 20 న తలపెట్టిన దేశవ్యాపిత కార్మిక సార్వత్రిక సమ్మె యెక్క ప్రధాన ఉద్దేశం అని  అన్నారు.  ఈ కార్యక్రమంలో టియుసిఐ మహబూబాబాద్ జిల్లా నాయకులు పాడిన బీకు, గుండాల సోమ నరసయ్య, మాచర్ల మురళి ప్రగతిశీల రిక్షా ఎగుమతి హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు వడ్లకొండ లక్ష్మయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మంగళపల్లి రామస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరవపల్లి వెంకన్న, జిల్లా అధ్యక్షులు ఏర్పుల మహేందర్, ఉపాధ్యక్షులు చెడిపల్లి యాకయ్య కార్యవర్గ సభ్యులు రాములు చంద్రు వెంకన్న సాయిలు మల్లయ్య యాకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Read Also కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

IMG-20250507-WA0056

Read Also బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?