తెలంగాణ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం

తెలంగాణ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం

 మిర్యాలగూడ, మే 06 (క్విక్ టుడే న్యూస్ ):- తెలంగాణా డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని అసోసియేషన్ భవనములో ఏర్పాటుచేసిన జిల్లా డాన్స్ మాస్టర్స్ సమావేశంలో తెలంగాణ స్పోర్ట్ జిల్లా అధ్యక్షుడు పాతనబోయిన శేఖర్, టౌన్ అధ్యక్షుడు అలుగుబెల్లి వెంకట్, జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నటువంటి డాన్స్ మాస్టర్స్ అందరూ ఐక్యమత్తంగా ఉండాలని జిల్లాల వారీగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే తమ డాన్స్ వృత్తిని కొనసాగించలి, వేరే జిల్లాల మాస్టర్లు ఇంకొక జిల్లాకు వెళ్లి డాన్స్ నేర్పడం సమంజసం కాదని వారు అన్నారు. త్వరలో జిల్లా కమిటీ సభ్యులు అందరికీ అసోసియేషన్ ద్వారా ఐడి కార్డులను అందజేస్తామని, అసోసియన్ కాదని ఎవరైతే డాన్స్ మాస్టర్లు జిల్లాలో కొనసాగితే వారిపై అసోసియేషన్ తరపున చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు. ఒక మాస్టర్ ఒక స్కూల్లో చేస్తున్నప్పుడు వేరే డాన్స్ మాస్టర్ వచ్చి నేను చేస్తాను అనడం తప్పు, యాజమాన్యం ద్వారా తమ స్కూల్లో ఎవరు పనిచేస్తున్నారు. తెలుసుకొని ఆ స్కూల్ మాస్టర్ నీ సంప్రదించిన తర్వాతనే డాన్స్ మాస్టర్లు వెళ్లాలని కోరారు. అసోసియేషన్ ద్వారా సభ్యత్వం లేని వారికి పని చేసే అర్హత లేదని, డాన్స్ వృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న డాన్స్ మాస్టర్ లకు తమ వంతు సహకారం ఉండాలని, పాఠశాల యాజమాన్యాన్ని కోరడమైనది. తెలంగాణ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ స్టేట్ బాడీ ద్వారా గణేష్, భాను, శేఖర్ మాస్టర్లను మిర్యాలగూడకు ఆహ్వానించింది. త్వరలో జిల్లా డాన్స్ మాస్టర్లకు ఐడి కార్డు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డాన్స్ మాస్టర్స్, వివిధ మండలాల డాన్స్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250506-WA0032

Read Also ఇంటర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?