ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల బదిలీ కొరకు కలెక్టర్ కు వినతిపత్రం

*వినతిలో ప్రముఖంగా వివరించిన అంశాలు*
పిట్టలగూడలోని కళాశాల భవనం చాలా పాతది, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంది. రాకపోకలు కష్టంగా ఉండటంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌లో ఖాళీగా ఉన్న బీఈడీ కళాశాల భవనంలోకి, మైనార్టీ గురుకుల కళాశాలను బదిలీ చేయాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. బదిలీ జరిగితే విద్యార్థులకు సులభమైన రాకపోకలు, నాణ్యమైన మౌలిక వసతులు, అడ్మిషన్లు పెరిగే అవకాశం, పేద మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడం, ప్రభుత్వ వనరుల సమర్థవంతమైన వినియోగం జరుగుతుంది. ఈ విజ్ఞప్తి పై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. మరియు తగిన పరిశీలన చేసి మైనారిటీ గురుకుల హెచ్.ఓ.డీ కి లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇది విద్యా సమానత్వం కోసం బీసీ సమాజ్ ప్రారంభించిన ఉద్యమానికి కీలక ఘట్టం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన భవిష్యత్ ఇవ్వాలన్న ఆత్మసంకల్పంతో బీసీ సమాజ్ ముందుంటుంది. అని బీసీ సమాజ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్నారు.