మిర్యాలగూడ లో పర్యటించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మిర్యాలగూడ లో పర్యటించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మిర్యాలగూడ, మే 10 (క్విక్ టుడే న్యూస్):- మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్-కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. గతంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రామచంద్రగూడెం వై జంక్షన్, తడకమల్ల ఎక్స్ రోడ్ వద్ద  ప్రమాదకరంగా మారిన ఫౌంటెన్ లు పరిశీలించారు. నూతనంగా మంజూరైన ఫ్లై ఓవర్లు నిర్మించాల్సిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం హనుమాన్ పేట ఫ్లై ఓవర్ కింద చిరు వ్యాపారులకు నిర్మించ తలపెట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించి, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా కళాభారతి ఆడిటోరియంలో మున్సిపల్, రెవిన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వీడియో ప్రజెంటేషన్ ద్వారా పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ కు వివరించారు. దానితోపాటు అభివృద్ధి పనుల పేరిట గతంలో జరిగిన అవినీతిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అవినీతి పై పూర్తి విచారణ చేపడతామని, పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ సమస్యల పై ప్రజెంటేషన్ ద్వారా సమస్యలను వివరించిన మొట్ట మొదటి ఎమ్మెల్యే మీరే అంటూ కలెక్టర్ బత్తుల లక్ష్మారెడ్డి ని అభినందించారు. ప్రధానంగా డంపింగ్ యార్డ్ తో సమీప కాలనీ ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు పట్టణానికి సుదూర ప్రాంతంలో స్థల సేకరణ జరపాలంటూ ఆదేశించారు. అధునాతన ట్రీట్మెంట్ ప్లాంట్ తో కూడిన డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, రోడ్డు వెడల్పు కు ఇబ్బందికరంగా మారిన న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు స్థానిక అధికారులు పూర్తి వివరాలతో, ప్రతిపాదనను పంపినట్లయితే లీగల్ సెల్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బందిని పెంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గతంలో నిర్మించిన పౌటెంట్ల కారణంగా జరిగిన ప్రమాదాల వివరాలు అందచేసినట్లయితే. ఆ స్థానంలో పునర నిర్మాణం జరిపి ప్రమాద నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మిర్యాలగూడ సబ్-డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మాణం జరుపుకుంటున్న ఎత్తిపోతల పథకాల పనుల పురోగతి పై సబ్-కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలసి, కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

IMG-20250510-WA0026

Read Also వైద్య సేవలో నర్సులు కీలకం

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?