18 మాసాల్లో కాంగ్రెస్ చేసింది శూన్యం
మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
మాజీ మంత్రి దయాకర్ రావు హయాంలో పాలకుర్తి నియోజకవర్గం లోని పలు మండలాల్లో చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ యత్నించడం హాస్యాస్పదమన్నారు. తొర్రూరు లో మినీ ట్యాంక్ బండ్ పనులు దయన్న హయాంలో మంజూరు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. తొర్రూరు పట్టణంతోపాటు, మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో దయన్న చేసిన పనులు తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత ఉందన్నారు. దయన్న హయాంలో జరిగిన అభివృద్ధిపై, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ అధికారంలోకి రావడానికి చెమట చిందించిన నాయకులను పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన నేతలను కూర్చోబెట్టుకున్నారన్నారు. ఆ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు స్థానం లేదని ఆ పార్టీ కార్యకర్తలకే అర్థమైందన్నారు.
ప్రతిపక్షాల నాయకులను ఉన్నపలంగా చేర్చుకుంటున్నారని, వారే కాంగ్రెస్ ను ఓడిస్తారని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలన చేత కావట్లేదని చేతులెత్తేశాడని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఈ సమావేశంలో పిఎసిఎస్ డైరెక్టర్ జనార్దన్ రాజు, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్,నాయకులు ఈనెపల్లి శ్రీనివాస్, ఎస్.కె అంకుస్, మాలోత్ కాలు నాయక్, లేగల వెంకట్ రెడ్డి, మాచర్ల వెంకన్న,కుమారస్వామి, దామోదర్ రెడ్డి,గోసంగి భాస్కర్, సోమలింగం, పయ్యావుల రామ్మూర్తి, బాబు నాయక్, ఎర్రం రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.